Begin typing your search above and press return to search.
జూ.అతిలోక సుందరి రీమేక్ క్వీన్ అవతారం
By: Tupaki Desk | 1 Oct 2020 2:40 PM ISTఓవైపు క్రేజీ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సౌత్ రీమేక్ లపై మనసు పారేసుకుంటోంది జాన్వీ కపూర్. అతిలోక సుందరి వారసురాలిగా జాన్వీ సౌత్ లో స్ట్రెయిట్ సినిమాలకు పెద్ద పీట వేస్తుందని భావిస్తే.. హిందీ పరిశ్రమను వదిలిపెట్టి ఇటువైపు వచ్చేట్టే కనిపించడం లేదు.
చరణ్ -జాన్వీ జంటగా నటిస్తామంటే `జగదేక వీరుడు అతిలోక సుందరి 2` కథను సిద్ధం చేస్తున్నామని అశ్వనిదత్ ఇంతకుముందు ప్రకటించనే ప్రకటించారు. కానీ ఆ ఇద్దరి నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. ఓవైపు చరణ్ తన సొంత ప్రాజెక్టులపై దృష్టిసారిస్తుంటే జాన్వీ మాత్రం కేవలం హిందీ పరిశ్రమకు మాత్రమే అంకితమై పని చేస్తోంది.
ఇటీవలే `గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్` లో నటనకు గొప్ప ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ చిత్రాలతో పాటు కంటెంట్ పై నడిచే చిత్రాలను డ్రైవ్ చేసే సత్తా జాన్వీకి ఉందని ప్రశంసలు దక్కాయి. ఇక ఈ సినిమాతో పాటు కరణ్ జోహార్ `దోస్తానా 2` లో `తఖ్త్`లో నటిస్తోంది. మరోవైపు సౌత్ టు హిందీ రీమేక్ లపైనా దృష్టి సారించి వరుసగా కమిటైపోతోంది. ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు పొందిన మలయాళ చిత్రం `హెలెన్` రీమేక్ కోసం చర్చలు జరుపుతోంది. దీంతో పాటే మరో రీమేక్ కి ఓకే చెప్పేసిందట.
2018 తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం `కోలమవు కోకిల` హిందీ రీమేక్ లో జాన్వీ కనిపించనుంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా చుట్టూ తిరిగే ఈ క్రైమ్ కామెడీలో నయనతార ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రం తెలుగులో కో కో కోకిలాగా విడుదలైంది. అగ్ర దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ఇటీవల తమిళ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకుని జాన్వీకి చెప్పారట. జాన్వి కపూర్ ఒరిజినల్ ను చూసిన తర్వాత ఓకే చేసేసిందట. సిద్ధార్థ్ సేన్ గుప్తా ఈ చిత్రంతో దర్శకత్వం వహించనున్నారు. ఫిబ్రవరి 2021లో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. జాన్వీ స్పీడ్ చూస్తుంటే మరో నాలుగైదేళ్లు అసలు కాల్షీట్ అన్నది పట్టుకోవడమే కష్టంగా కనిపిస్తోంది.