Begin typing your search above and press return to search.

జనతా గ్యారేజ్ అరుదైన మైలురాయి

By:  Tupaki Desk   |   19 Sept 2016 4:02 PM IST
జనతా గ్యారేజ్ అరుదైన మైలురాయి
X
డివైడ్ టాక్ ను తట్టుకుని అద్భుత విజయమే సాధించింది ‘జనతా గ్యారేజ్’. ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన కొన్ని కలెక్షన్ల రికార్డుల్ని ఖాతాలో వేసుకున్న ఈ సినిమా.. తాజాగా రూ.125 కోట్ల గ్రాస్ మార్కును అందుకుని సంచలనం సృష్టించింది. తెలుగులో అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న రెండో సినిమా జనతా గ్యారేజే కావడం విశేషం. ‘బాహుబలి’ మాత్రమే ఈ చిత్రం కంటే వేగంగా ఆ మార్కును టచ్ చేసింది. ‘జనతా గ్యారేజ్’ షేర్ రూ.80 కోట్లను దాటడం విశేషం. ప్రస్తుతం టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్స్ లిస్టులో ఎన్టీఆర్ సినిమా మూడో స్థానానికి చేరిపోవడం విశేషం. బాహుబలి..శ్రీమంతుడు మాత్రమే దాని కంటే ముందున్నాయి.

టాప్-5లో ఒక్కో సినిమాను వెనక్కి నెడుతూ మూడో స్థానానికి చేరింది ‘జనతా గ్యారేజ్’. ముందు ‘సరైనోడు’ను దాటిన ఈ సినిమా.. తాజాగా మగధీర.. అత్తారింటికి దారేది సినిమాల్ని కూడా అధిగమించింది. మూడో వీకెండ్లో వచ్చిన సినిమాలేవీ ఆసక్తి రేకెత్తించకపోవడం.. వాటి టాక్ కూడా నెగెటివ్ గా ఉండటం ‘జనతా గ్యారేజ్’కు బాగా కలిసొచ్చింది. ఈ వారాంతంలో కూడా మంచి కలెక్షన్లు రావడంతో ‘జనతా గ్యారేజ్’ టాప్-3లోకి అడుగుపెట్టేసింది. టాలీవుడ్ థర్డ్ హైయెస్ట్ గ్రాసర్ అంటూ అఫీషియల్ పోస్టర్లు కూడా పడిపోయాయి. ఐతే రూ.86 కోట్ల షేర్ తో రెండో స్థానంలో ఉన్న ‘శ్రీమంతుడు’ను దాటడం ‘జనతా గ్యారేజ్’కు కష్టమే కావచ్చు. వచ్చే శుక్రవారం నాని సినిమా ‘మజ్ను’ మంచి అంచనాల మధ్య రిలీజవుతోంది. దానికి టాక్ బాగుంటే.. ‘జనతా గ్యారేజ్’ డ్రీమ్ రన్ కు తెరపడినట్లే.