Begin typing your search above and press return to search.

డీజే బ్యూటీ అప్పుడే డిమాండ్లా?

By:  Tupaki Desk   |   19 Feb 2022 12:30 AM GMT
డీజే బ్యూటీ అప్పుడే డిమాండ్లా?
X
ముంబై బ్యూటీ నేహాశెట్టి ఇటీవ‌ల రిలీజ్ అయిన `డీజేటిల్లు` చిత్రంతో తొలి స‌క్సెస్ ని ఖాతాలో వేసుకుంది. హిలేరియ‌స్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ తో బ్యూటీ ప్రేక్ష‌కుల‌కు రీచ్ అయింది. అయితే ఇందులో నేహా న‌ట‌న‌కు అంత‌గా ఆస్కారం లేదుగానీ...లిప్ లాక్ స‌న్నివేశాలు..రొమాంటిక్ సీన్స్ తో యువ‌త అటెన్ష‌న్ డ్రా చేయ‌గ‌లిగింది. ఆ ర‌కంగా నేహా ఫేమ‌స్ అవుతోంది. బిసీ సెంట‌ర్ల‌లో పెద‌వి ముద్దుల‌కే విజిల్స్ ప‌డుతున్నాయి.

ఆ ర‌కంగా మాస్ లో ఫాలోయింగ్ సంపాదించ‌గ‌ల్గింది. ఇప్పుడీ క్రేజ్ బ్యూటీకి ఎర్ర తివాచీ ప‌రిచిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. బ్యూటీ తొలి స‌క్సెస్ చూసిన ద‌ర్శ‌క‌..నిర్మాత‌లు త‌మ సినిమాలో న‌టించాల‌ని అడుగుతున్నారుట‌. కొంత మంది అగ్ర ద‌ర్శ‌క‌..నిర్మాత‌ల నుంచి సైతం ఫోన్ కాల్స్ వెళ్లాయ‌ని స‌మాచారం. ఇదే అదునుగా భావించిన నేహా శెట్టి పారితోషికం డిమాండ్ గ‌ట్టిగానే చేస్తోందని టాక్ వినిపిస్తోంది.

కొన్ని క‌మిట్ అయిన చిత్రాలు కూడా ఉన్నాయిని...వాటి కోసం భారీగానే రెమ్యూన‌రేష‌న్ అందుకుంద‌ని ఫిలిం స‌ర్కిల్స్ లో గుస గుస వినిపిస్తోంది. మొత్తానికి ఒక హిట్ తో నేహా శెట్టి కెరీర్ బిగ్ ట‌ర్న్ తీసుకున్న‌ట్లే క‌నిపిస్తోంది. ఈ బ్యూటీ తొలుత పూరి జ‌గ‌న్నాధ్ త‌న‌యుడు ఆకాష్ హీరోగా న‌టించిన `మెహ‌బూబ` చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే.

భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. చాలా గ్యాప్ త‌ర్వాత నేహాశెట్టికి `డీజే టిల్లు`లో అవ‌కాశం వ‌చ్చింది. ఇప్పుడు వ‌చ్చిన స‌క్సెస్ ని తెలివిగా ఎన్ క్యాష్ చేసుకుంటోంది. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దాలి అన్న నానుడిని తూచ త‌ప్ప‌కుండా పాటిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈస‌క్సెస్ తో కొంత మంది హీరోయిన్లు రేసులో వెనుక‌బ‌డ‌తారు అన్న విశ్లేష‌ణ తెర‌పైకి వ‌స్తోంది.

షాలిని పాండే..రీతు వ‌ర్మ లాంటి హీరోయిన్ల‌కు ఇప్ప‌టికే డిమాండ్ త‌గ్గింది. పెద్ద‌గా అవ‌కాశాలు కూడా రాలేదు. ఈ నేప‌థ్యంలో నేహాశెట్టి వాళ్ల‌కున్న చిన్న‌పాటి అవ‌కాశాల్ని కూడా చేజిక్కించుకుంటుంద‌ని టాక్ వినిపిస్తోంది.

ఈబ్యూటీకి పోటీగా `పెళ్లి సంద‌డి` ఫేం శ్రీలీల‌.. `ఖిలాడి` ఫేం డింపుల్ హ‌య‌తి లాంటి వాళ్లు నిలుస్తార‌ని టాక్. వీళ్లంతా ఒకే జ‌న‌రేషన్ హీరోయిన్ల‌ గా గుర్తింపుప‌డుతున్నారు. వ‌య‌సు రీత్యా పెద్ద‌గా తేడాలు ఉండ‌వు.