Begin typing your search above and press return to search.

మహేష్ అతనికి ఓకే చెప్పేశాడా ?

By:  Tupaki Desk   |   16 May 2019 12:05 PM IST
మహేష్ అతనికి ఓకే చెప్పేశాడా ?
X
గీత గోవిందం లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు పరశురామ్ ఇప్పటికే పది నెలల గ్యాప్ పూర్తి చేసుకున్నాడు. తర్వాత సినిమా గీత సంస్థకే కమిట్ అయినా కాంబినేషన్ సెట్ కాకపోవడంతో ఇన్ని నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది. తాజా అప్ డేట్ ప్రకారం పరశురామ్ చెప్పిన ఒక లైన్ మహేష్ బాబుకి నచ్చిందని వినికిడి.

కొరటాల శివ ద్వారా ప్రిన్స్ ని కలిసిన ఇతను తక్కువ టైంలోనే ఇంప్రెస్ అయ్యేలా చిన్న నరేషన్ ఇచ్చి ఫుల్ వెర్షన్ చేసుకుని రమ్మనే మాటతో హ్యాపీగా వెనక్కు వచ్చాడట. అంటే అనిల్ రావిపూడి తర్వాత ప్రాజెక్ట్ కోసం ఇప్పటి నుంచే రంగం సిద్ధమవుతోంది అన్నమాట .నిర్మాత ఎవరు ఉంటారు అనేది మాత్రం తేలాల్సి ఉంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే మూవీ నుంచి దిల్ రాజు తప్పుకున్నాక అనిల్ సుంకర సోలో ప్రొడ్యూసర్ గా నిలిచారు. సో ఒక కమిట్ మెంట్ దిల్ రాజుకి మహేష్ బాలన్స్ ఉన్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ కోసం గతంలోనే మాట ఇచ్చాడు మహేష్. ఎలాగూ పరశురామ్ గీత ఆర్ట్స్ లోనే లాక్ అయ్యాడు కాబట్టి ఒక దెబ్బకు మూడు పిట్టలు తరహాలో ఇది కనక దిల్ రాజు-అల్లు అరవింద్ లు కలిసి ప్రొడ్యూస్ చేస్తే అన్ని కమిట్మెంట్స్ పూర్తవుతాయి. ఇది ఇప్పటికిప్పుడు తేలదు కానీ మహేష్ వరల్డ్ కప్ హాలిడే టూర్ ముగించుకుని వచ్చాక డిసైడ్ అవ్వొచ్చు