Begin typing your search above and press return to search.

‘జైభీమ్’ సినిమాపై ఐఏఎస్ అధికారి సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   6 Nov 2021 12:50 PM GMT
‘జైభీమ్’ సినిమాపై ఐఏఎస్ అధికారి సంచలన వ్యాఖ్యలు
X
తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘జై భీమ్’. జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కొన్ని యాథార్థ ఘటనల ఆధారంగా సమాజంలోని అణగారిన వర్గాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొందరు పెద్ద మనుషులు చేస్తున్న దారుణాలను ఈ సినిమాలో కళ్లకు కట్టారు. అన్యాయంగా ఓ కేసులో చిక్కుకున్న పేద కుటుంబం తరుఫున పోరాడే లాయర్ పాత్రలో హీరో సూర్య నటించాడు.సూర్య-జ్యోతిక దంపతులు ఈ సినిమాను నిర్మించారు.

ఈ చిత్రం ఒక నిజమైన లాయర్ స్టోరీ. దాన్ని అంతే అద్భుతంగా తీయడంతో అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమాను చూసిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ‘నా హృదయం బరువెక్కింది.. రాత్రంతా నిద్రపట్టలేదు’ అంటూ ఓ లేఖను కూడా విడుదల చేయడం విశేషం.

ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ‘జైభీమ్’ బాగా ట్రెండ్ అవుతోంది. పలువురు ప్రముఖులు ఈ సినిమాను చూస్తూ తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాను ప్రముఖ ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు వీక్షించాడు. ఈ సందర్భంగా సినిమాలోని ఓ సన్నివేశాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. జైల్లో కొందరు ఖైదీలను పోలీసులు దారుణంగా హింసించే సన్నివేశం అది. దీనిని చూసిన కలెక్టర్ తన జీవితంలోనూ ఇలాంటి దారుణం ఒకటి జరిగిందని బాంబు పేల్చాడు.

మారుమూల గిరిజన ప్రాంతాల్లోనే కాదు.. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. 2011లో మెదక్ జిల్లా పటాన్ చెరులో ఒక వ్యక్తి పోలీసుల కస్టడీలో మరణించాడని.. తానప్పుడు మెదక్ ట్రైనీ కలెక్టర్ గా ఉన్నానని.. నన్ను మెజిస్ట్రీరియల్ అధికారి పంపిస్తే విచారణలో జైలు, మార్చురీ ఆస్పత్రిని సందర్శించాక పోలీసు సిబ్బందిదే తప్పని తేలిందని.. ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుందని వివరించారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.