Begin typing your search above and press return to search.

ఈ మహానుభావుడినా నేను పక్కన పెట్టింది: విష్వక్సేన్

By:  Tupaki Desk   |   11 Feb 2022 3:31 AM GMT
ఈ మహానుభావుడినా నేను పక్కన పెట్టింది: విష్వక్సేన్
X
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా 'డీజే టిల్లు' రూపొందింది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల బాణీలను అందించగా, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సిద్ధు జోడీగా

ఈ సినిమాలో నేహా శెట్టి అలరించనుంది. ఇప్పటికే ఓ రెండు పాటలు జనంలోకి బాగా వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదికపై విష్వక్సేన్ మాట్లాడాడు.

'డీజే టిల్లు' .. ఈ సినిమా చాలామంది కోసం ఆడాలి. సిద్ధు ఇంతకుముందు 'కృష్ణ అండ్ హిజ్ లీల' చేసినప్పుడు నేను చూశాను. ఆ సమయంలో నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. సిద్ధూను చూసిన తరువాత నాకు హీరో దొరికేశాడని అనుకున్నాను. 'నేనే సినిమా చేసుకుంటున్నాను .. నాతో సినిమా చేయడానికి నువ్వెవడివి అన్నట్టుగా వచ్చాడు. రాత్రి 11:30 గంటల సమయంలో ఒక్కో డైలాగ్ వదలడం మొదలుపెట్టాడు. ఒక్కో డైలాగ్ ఒక్కో బాణమన్నమాట.

నా సినిమా ఆయన చేయడు అనే విషయం అప్పుడు నాకు అర్థమైపోయింది. మొన్న సంక్రాంతి రోజున డాబాలపై పతంగులు ఎగరేస్తున్నప్పుడు కూడా విన్నాను .. అన్ని చోట్లా 'డీజే టిల్లు' సాంగ్ నే వినిపించింది. జనాలకు ఈ సినిమా ఎక్కడికక్కడ ఎక్కేసిందని నాకు తెలిసిపోయింది.

'డీజే టిల్లు' నుంచి ట్రైలర్ వచ్చిన తరువాత, అరే ఈ మహానుభావుడినా మనం పక్కన పెట్టింది అనిపించింది. ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ఇక సితార నాగవంశీ గారు కూడా నాకు బాగా తెలుసు. ఎవరైనా ఒకసారి అడ్వాన్స్ ఇస్తారు .. కానీ ఆయన నాకు రెండు సార్లు అడ్వాన్స్ ఇచ్చారు. కానీ ఇంతవరకూ నాతో సినిమా తీయలేదు. కొంతమంది కొన్ని లెక్కలు వేసుకుని సినిమా తీస్తారు .. కొంతమంది సినిమా పట్ల గల ప్రేమతో సినిమా తీస్తారు. రెండవ కోవకి చెందిన నిర్మాత ఆయన. బయట ఈ సినిమాకి మంచి హైప్ ఉంది. సినిమా ఆడాలి .. ఆడతది .. నో డౌట్" అంటూ చెప్పుకొచ్చాడు.