Begin typing your search above and press return to search.
గల్లీ రౌడీ` ఓటీటీలోకి రాడు నేరుగా థియేటర్లలోకే
By: Tupaki Desk | 8 July 2021 11:00 PM ISTఏ1 ఎక్స్ ప్రెస్ చిత్రంతో చివరిసారిగా తెలుగు ఆడియెన్ ముందుకు వచ్చాడు సందీప్ కిషన్. స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందిన ఆ సినిమా ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. అయినా నిరాశ చెందక వరుసగా సినిమాలకు సంతకాలు చేశాడు. గత కొన్ని రోజులుగా సందీప్ కిషన్ కొత్త చిత్రం గల్లీ రౌడీ OTT లో రిలీజైపోతోందని కథనాలొస్తున్నాయి. ఈ వార్త మీడియా అంతటా వైరల్ అయ్యింది. అయితే ఇది నిజమా? అంటే.. సందీప్ కిషన్ స్వయంగా దానిని ఖండించారు.
గల్లీ రౌడీ ఓటీటీల్లోకి రాడు.. నేరుగా థియేటర్లలోనే విడుదల చేస్తున్నామని చెప్పారు. గల్లీ రౌడీ థియేటర్లలో మాత్రమే ఆస్వాధించాల్సిన చిత్రం అని అన్నారు. కరోనా కష్ట సమయంలో థియేటర్ యజమానులకు సహాయం చేసేందుకు నిర్మాత కోన వెంకట్ థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గల్లీ రౌడీకి జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. విడుదల తేదీ త్వరలోనే ప్రకటిస్తారు.
సందీప్ కిషన్ తదుపరి మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. వివాహ భోజనంబు- నరగాసురన్ - కసడ తపర అనే మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. వివాహ భోజనంబు చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు.