Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్‌.. మరో 'సింగం' రాబోతున్నాడు

By:  Tupaki Desk   |   10 Nov 2022 7:21 AM GMT
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్‌.. మరో సింగం రాబోతున్నాడు
X
తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చిన 'సింగం' సిరీస్ నుండి మరో సినిమా రాబోతుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమాకు పని చేయబోతున్న టెక్నీషియన్స్ మరియు యూనిట్‌ సభ్యులు తెలియజేశారు. వారు చెబుతున్న దాని ప్రకారం 'సింగం 4' సినిమా కోసం దర్శకుడు హరి కథను రెడీ చేస్తున్నాడట.

సింగం 4 ను కేవలం సౌత్ ఆడియన్స్ కోసం అన్నట్లుగా కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో ఉండేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అధ్బుతమైన యాక్షన్ ఎంటర్‌ టైనర్స్ గా సింగం యొక్క మూడు సినిమా లు కూడా ప్రేక్షకులను ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను అలరించిన విషయం తెల్సిందే. అందుకే నాల్గవ సింగం కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సూర్య హీరోగా హరి దర్శకత్వంలో వచ్చిన సింగం ను తెలుగు లో కూడా అదే రేంజ్ లో విడుదల చేయడం.. అక్కడ మాదిరిగానే ఇక్కడ కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది.

అక్కడ ఇక్కడ కలిపి అప్పట్లో భారీ వసూళ్లు సొంతం చేసుకున్న సింగం ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా వసూళ్లు నమోదు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం హరి వేరే సినిమా తో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా సూర్య కూడా బిజీ బిజీగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. కనుక సింగం 4 సినిమా పట్టాలెక్కాలంటే కనీసం ఆరు ఏడు నెలల సమయం పడుతుంది అంటూ తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

నటుడిగా సూర్య కు సౌత్‌ తో పాటు ఉత్తర భారతంలో కూడా మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా సింగం. కనుక ఆ సీక్వెల్‌ కు సూర్య ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. కాస్త విభిన్నంగా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా సింగం 4 ఉంటే చాలు భారీగా వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.