Begin typing your search above and press return to search.

'గని' ఫస్ట్ గ్లిమ్స్: మెగా ప్రిన్స్ ఫస్ట్ పంచ్ గట్టిగా పడింది..!!

By:  Tupaki Desk   |   6 Oct 2021 12:14 PM GMT
గని ఫస్ట్ గ్లిమ్స్: మెగా ప్రిన్స్ ఫస్ట్ పంచ్ గట్టిగా పడింది..!!
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ''గని''. బాక్సింగ్ క్రీడ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ని ఈరోజు మేకర్స్ రిలీజ్ చేశారు.

'గని ఫస్ట్ పంచ్' పేరుతో వచ్చిన ఈ 39 సెకన్ల వీడియో.. వరుణ్ తేజ్ పవర్ ప్యాక్ పంచ్‌ ని చూపిస్తోంది. బాక్సింగ్ రింగ్ లో ఉన్న వరుణ్.. ప్రత్యర్థిని తన పంచ్ తో పడగొట్టడం చూడొచ్చు. ఇందులో ప్రొఫెషనల్ బాక్సర్ గా మెగా హీరో ట్రాన్స్ఫర్మేషన్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతుందనేది ఈ చిన్న గ్లిమ్స్ సూచిస్తోంది.

ఫస్ట్ పంచ్ కు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సమకూర్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ - జార్జ్ సి విలియమ్స్ అందించిన విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా 'గని' చిత్రాన్ని డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ పిక్చర్స్ - అల్లు బాబీ కంపెనీ పతాకాలపై అల్లు బాబీ - సిద్ధు ముద్ద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఉపేంద్ర - సునీల్ శెట్టి - జగపతిబాబు - నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవల్ మరియు దిలీప్ సుబ్బరాయన్ ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ ని డిజైన్ చేశారు. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. అబ్బూరి రవి ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. 'ఎఫ్ 2' 'గద్దల కొండ గణేష్' వంటి విజయాల తర్వాత వరుణ్ తేజ్ నటిస్తున్న ''గని'' ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.