Begin typing your search above and press return to search.

గ్యాంగ్ ఎంత దోచుకుందంటే...

By:  Tupaki Desk   |   31 Jan 2018 11:50 AM GMT
గ్యాంగ్ ఎంత దోచుకుందంటే...
X
కోలీవుడ్ హీరోలు గత కొన్నేళ్లుగాటాలీవుడ్ లో మార్కెట్ ను కొంచెం కొంచెంగా పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఒక్క హిట్ పడిందంటే చాలు రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. చాలా వరకు డబ్బింగ్ సినిమాలు మంచి కలెక్షన్స్ ని కూడా అందుకుంటున్నాయి. ఇక ఈ సంక్రాంతికి స్టార్ హీరోలతో పోటీ పడటానికి వచ్చిన సూర్య తన గ్యాంగ్ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సపోర్ట్ తో రిలీజ్ చేశాడు.

మొదట ట్రైలర్ తోనే సినిమా అంచనాలను హై రేంజ్ లో అందుకుంది. ఇక రిలీజ్ తరువాత అనుకున్నంత రేంజ్ లో కాకపోయినా తెలుగు సినిమాలకంటే కొంత వరకు పరవాలేదు అనే విధంగా సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో సినిమాకు ఓపెనింగ్స్ బాగానే అందాయి. మొత్తంగా సినిమా రూ.7కోట్ల వరకు కలెక్ట్ చేసి కలెక్షన్స్ పరంగా యావరేజ్ లిస్ట్ లో చేరింది. సూర్య గత చిత్రం సింగం 3 రూ.10కోట్ల వరకు షేర్స్ కలెక్ట్ చేసింది. ఈ సినిమాకు ఆ రేంజ్ లో కలెక్షన్స్ వస్థాయని అనుకున్నారు కాని అంచనాలను అందుకోలేదు.

మొత్తంగా తెలుగు క్లోజింగ్ షేర్స్ కలెక్షన్

నైజాం -1.90Cr
సీడెడ్ - 1.13Cr
గుంటూరు - 0.83Cr
ఈస్ట్ - 0.55Cr
వెస్ట్ 0.52Cr
కృష్ణ 0.64Cr
నెల్లూరు - 0.36Cr
మొత్తం 7.28Cr