Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: సింగపూర్లో దొరసాని జిల్ జిల్

By:  Tupaki Desk   |   7 May 2020 10:30 AM GMT
ఫోటో స్టోరీ: సింగపూర్లో దొరసాని జిల్ జిల్
X
రాజశేఖర్-జీవితల రెండవ కూతురు శివాత్మిక 'దొరసాని' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయినా నటిగా శివాత్మికకు మంచిపేరు తీసుకొచ్చింది. నటనే కాదు.. సినిమా ప్రమోషన్స్ సమయంలో ఎంతో చురుకుగా ఉండడం అందరి దృష్టిని ఆకర్షించింది. అందరిలాగే శివాత్మిక ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ స్టే హోమ్ స్టే సేఫ్ అనే స్లోగన్ ను పాటిస్తోంది.

అయితే బయటకు అడుగుపెట్టకుండా రోజుల తరబడి ఉండిపోతే ఎవరికైనా గతంలో బయట తిరుగుతూ సరదాగా గడిపిన క్షణాలు గుర్తొస్తాయి కదా. శివాత్మికకు అలాగే అందమైన పాత రోజులు గుర్తొచ్చాయి. అందుకే 2019 లో సింగపూర్ ట్రిప్ వెళ్ళిన సమయంలో తీయించుకున్న ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసి "గుడ్ ఓల్డ్ డేస్ #సింగపూర్ 2019" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో సింగపూర్ లోని ఓ ఆకాశహర్మ్యం పైన ఉండే ఈతకొలనులో సేదతీరుతూ ఈ ఫేక్ లోకానికి చాలా దూరంగా ఉంది. నేపథ్యంలో ఉన్న పొడవాటి బిల్డింగులు చాలా అందంగా ఉన్నాయి. ఫోటోకు కొత్త అందం తీసుకొచ్చాయి.

ఈ ఫోటోకు నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. "అబ్బా.. సో నైస్".. "శివ శివా"... "పట్నం వచ్చిన దొరసాని" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే అదిత్ అరుణ్ హీరోగా తెరకెక్కుతున్న 'విధి విలాసం'అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.