Begin typing your search above and press return to search.

`ఈటీ`.. సూర్య ప‌వ‌ర్ ప్యాక్డ్‌ పెర్ఫార్మెన్స్

By:  Tupaki Desk   |   18 Feb 2022 7:43 PM IST
`ఈటీ`.. సూర్య ప‌వ‌ర్ ప్యాక్డ్‌ పెర్ఫార్మెన్స్
X
`సింగం 3` త‌రువాత హీరో సూర్య యాక్ష‌న్ మోడ్ లోకి వ‌చ్చి చాలా కాల‌మ‌వుతోంది. ప‌వ‌ర్ ప్యాక్ట్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో సింగం సిరీస్ చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న సూర్య మ‌ళ్లీ ఐదేళ్ల త‌రువాత యాక్ష‌న్ మోడ్ లోకి వ‌చ్చేశారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `ఎంతార్కుమ్ తున్నింధ‌వ‌న్‌`(`ఈటీ`). త‌మిళంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీ తో పాన్ ఇండియా ని టార్గెట్ చేశారు. మార్చి 10న ఈ చిత్రం త‌మిళ - తెలుగు - క‌న్న‌డ - హిందీ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

పాండిరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై క‌ళానిధి మార‌న్ నిర్మించారు. మాళ‌విక మోహ‌న‌న్ హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్ర టీజ‌ర్ ని తాజాగా శుక్ర‌వారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఆకాశ‌మే నీ హ‌ద్దురా, జై భీమ్ వంటి చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ సూప‌ర్ హిట్ ల‌ని సొంతం ఏసుకున్న సూర్య రెట్టించిన ఉత్సాహంతో స‌రికొత్త మేకోవ‌ర్ తో చేసిన చిత్ర‌మిది. దేనికైనా రెడీ అంటూ డేర్ డెవిల్ గా ముందుకు సాగే ఓ యువ‌కుడి క‌థ‌గా ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు పాండిరాజ్ తెర‌కెక్కించారు.

జైలు గోడ‌ల మ‌ధ్య వున్న సూర్ విజువ‌ల్స్ తో టీజ‌ర్ మొద‌లైంది. ఇందులో లుంగీలో ప‌ల్లెటూరి యువ‌కుడిగా క‌నిపిస్తున్న సూర్య మ‌రో డైమెన్ష‌న్ లో సిటీ యువ‌కుడిగా క‌నిపించిన తీరు ఆక‌ట్టుకుంటోంది. వ‌న్ మినిట్ 6 సెకండ్ నిడివితో సాగే ఈ టీజ‌ర్ ఆత్యంతం ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌తో.. సాగింది. అయితే ఇందులో ద‌ర్శ‌కుడు ఏం చెప్ప‌బోతున్నాడ‌న్న‌ది మాత్రం చిన్న హింట్ కూడా ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అయితే సూర్య మాత్రం గ‌త ఐదేళ్లుగా మాస్ ప్రేక్ష‌కులు త‌న నుంచి ఎలాంటి చిత్రాన్ని కోరుకుంటున్నారో ఆ స్థాయి హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ తో రాబోతున్నాన‌ని టీజర్ తో హిట్ ఇచ్చేశాడు. `సింగం 3` త‌రువాత ఆ స్థాయి పాత్ర‌ల్లో క‌నిపించ‌ని సూర్య `ఈటీ`లో చాలా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. అదే విష‌యాన్ని టీజ‌ర్ తో క్లారిటీ ఇచ్చేశాడు. హీరో విన‌య్ రాజ్ సైకో విల‌న్ గా న‌టిస్తున్న ఈ చిత్రం గ్రామీణ యువ‌కుడికీ.. అర్బ‌న్ విల‌న్ కీ మ‌ధ్య సాగే స‌మ‌రంగా క‌నిపిస్తోంది.

ఈ మూవీలోని కీల‌క పాత్ర‌ల్లో స‌త్య‌రాజ్ - రాజ్ కిర‌ణ్ - శ‌ర‌ణ్య - సూరి - సిబి భువ‌న‌చంద్ర‌న్ - దేవద‌ర్శిని -ఇళ‌వ‌ర‌సు న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం పాన్ ఇండియా చిత్రాల ప‌రంప‌ర కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని త‌మిళ - తెలుగు - క‌న్న‌డ -హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. మార్చి 10న విడుద‌ల కానుంది.