Begin typing your search above and press return to search.

ఈరోస్‌ దసరా బూతు ట్వీట్‌ లపై కంగనా అంతకు మించి

By:  Tupaki Desk   |   23 Oct 2020 2:00 PM IST
ఈరోస్‌ దసరా బూతు ట్వీట్‌ లపై కంగనా అంతకు మించి
X
ప్రముఖ నిర్మాణ సంస్థ.. ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఈరోస్‌ దసరా సందర్బంగా ఎంటర్‌ టైన్‌ మెంట్‌ అందించబోతున్నట్లుగా చేసిన డబుల్‌ మీనింగ్‌ బూతు ట్వీట్స్‌ వివాదాస్పదం అయ్యాయి. కత్రీనా ఫొటోతో డు యు వాంట్‌ పుట్‌ మై రాత్రి ఇన్‌ నవరాత్రి అని.. సల్మాన్‌ ఫొటోకు యు నీడ్‌ ఏ దాండి టు ప్లే దాండియా.. ఐ హ్యావ్‌ వన్‌ అని... ఇంకా రణ్వీర్‌ సింగ్‌ ఫొటోతో లెట్స్‌ హ్యావ్‌ సమ్‌ మజా ఇన్‌ పైజామా అంటూ డబుల్‌ మీనింగ్‌ తో ఈరోస్‌ చేసిన ట్వీట్స్‌ క్షణాల్లో వైరల్‌ అయ్యి విమర్శలు వచ్చాయి. దాంతో కొద్ది నిమిషాలకే ఆ పోస్ట్‌ ను ఈరోస్‌ సంస్థ డిలీట్ చేసింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది. క్షమాపణలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఈరోస్‌ సంస్థను టార్గెట్‌ చేసి చాలా మంది ప్రముఖులు సైతం విరుచుకు పడ్డారు.

రంజాన్‌ సమయంలో ఇలాంటి పోస్ట్‌ లు పెట్టే దమ్ము ధైర్యం మీకు ఉందా. హిందు పండుగలు అంటే ఎందుకు మీకు ఇంత చులకన భావం అంటూ చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈరోస్‌ ఈ బూతు ట్వీట్స్‌ పై కంగనా అంతకు మించి అన్నట్లుగా స్పందించింది. ఈరోస్‌ వారు డిలీట్‌ చేసిన ట్వీట్స్‌ ను మళ్లీ కంగనా షేర్‌ చేసి మరీ విమర్శలు చేసింది. సినిమాను ఎవరైతే థియేటర్లలో చూస్తారో వారిని మనం కాపాడుకోవాల్సన పరిస్థితి వచ్చింది. లైంగిక కంటెంట్‌ పై ఆదారపడే డిజిటల్‌ వాళ్లు ఎక్కువ మందిని ఆకర్షించడం కష్టం. డిజిటలైజేషన్‌ వల్ల కళ పెద్ద సంక్షోభంలో ఇరుక్కుంది. స్ట్రీమింగ్‌ ప్లాట్‌ ఫామ్స్‌ అంటే పోర్న్‌ హబ్స్‌ తప్ప మరేమి కాదు అంటూ తనదైన శైలిలో ఈరోస్ వారికి సరైన సమాధానం చెప్పింది. ఈ విషయంలో చాలా మంది కంగనాను సమర్థిస్తూ ట్వీట్స్‌ చేశారు.