Begin typing your search above and press return to search.
#DRUGS కేసు: NCB కి దీపిక ఏమీ చెప్పలేదా? ఇంతకీ `కింగ్ పిన్` ఎవరు?
By: Tupaki Desk | 27 Sept 2020 2:40 PM ISTబాలీవుడ్ డ్రగ్స్ కేసులో శనివారం దీపిక పదుకునే నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో ముందు హాజరైన విషయం తెలిసిందే. మేనేజర్ కరిష్మాతో డ్రగ్ చాట్ కారణంగా దీపికకు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. సమన్లు అందుకున్న దీపిక శనివారం ఎన్సీబీ ముందు హాజరైంది. అయితే ఆమెని ఐదున్నర గంటల పాటు విచారించారట. అయితే ఈ విచారణలో దీపిక ఎమోషన్ అయ్యిందని మూడు సార్లు కేకలు వేస్తూ ఏడ్చేసిందని ఇదివరకూ ఓ జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. అయితే వేరొక సోర్స్ ప్రకారం.. దీపిక ఈ దర్యాప్తులో ఎలాంటి విషయాల్ని వెల్లడించలేదని.. ఎవరి పేర్లను రివీల్ చేయలేదని.. ఆద్యంతం తప్పించుకునే ప్రయత్నం చేసిందని తాజాగా వేరొక జాతీయ మీడియా కథనం చెబుతోంది.
డ్రగ్స్ కేసు విషయంలో దీపికకు ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వలేదని.. మరోసారి ఎన్సీబీ ముందు దీపిక హాజరు కావాల్సి వుంటుందని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. దీపిక తనకు తన మేనేజర్ కరిష్మాకు మధ్య జరిగిన డ్రగ్ చాట్ ని అంగీకరించారు కానీ అంతకు మించి వివరాలేవీ వెల్లడించకపోవడంతో ఎన్సీబీ అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. డ్రగ్ చాట్ లో దీపిక మాల్ .. హాష్‌ల గురించి విచారణలో స్పష్టంగా వెల్లడించిందట. అయితే తాను డ్రగ్స్ సేవించలేదని అన్నట్టుగా మీడియా కథనాలొచ్చాయి.
టాలెంట్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ వ్యవస్థాపక భాగస్వామి ధ్రువ్ చిట్గోపేకర్ ను కూడా దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. టాలెంట్ మేనేజర్ జయ సాహాను ప్రశ్నించినప్పుడు ఈ సమాచారం కొంత వెల్లడైంది. ఈ కేసుకి అతనే ‘కింగ్ పిన్’ గా మారుతున్నట్టు జాతీయ మీడియా కథనం వేడెక్కిస్తోంది.