Begin typing your search above and press return to search.

పుట్టు మ‌చ్చ‌ల పురాణం.. కాకినాడ‌ కాజా.. ఏంటిది సామీ

By:  Tupaki Desk   |   9 April 2022 7:32 AM GMT
పుట్టు మ‌చ్చ‌ల పురాణం.. కాకినాడ‌ కాజా.. ఏంటిది సామీ
X
టాలీవుడ్ లో సినిమా ప్ర‌మోష‌న్ ల సంద‌ర్భంగా స్టార్స్‌, స్టార్ ప్రొడ్యూస‌ర్స్ చేస్తున్న కామెంట్స్ ఇప్ప‌డు నెట్టింట వైర‌ల్ గా మారి చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. కొంత మంది ఈ కామెంట్ ల‌ని ఎంజాయ్ చేస్తుంటే మ‌రి కొంత మంది మాత్రం ట్రోల్ చేస్తుండ‌టం హాట్ టాపిక్ గా మారింది. సినిమా ప్ర‌చారం లో భాగంగా ప్రేక్ష‌కుల్ని ఎట్రాక్ట్ చేయ‌డం కోసం నిర్మాత‌లు చేస్తున్న కొన్ని కామెంట్స్ అనుకోకుండా వారి కి తెలియ‌కుండానే వివాదాస్ప‌దం అవుతూ నెట్టింట పెద్ద చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా హీరోయిన్ ల‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్స్ చేస్తున్న స‌ర‌దా కామెంట్స్ ఇటీవ‌ల సోష‌ల్ మీడియా కార‌ణంగా వివాదాస్ప‌ద చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి.

ఇటీవ‌ల సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టించిన చిత్రం 'డీజే టిల్లు'. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై యువ నిర్మాత సూర్యదేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. యంగ్ బ్యూటీ నేహా శెట్టి ఇందులో హీరోయిన్ గా న‌టించింది. డెక్క‌న్ ఫ్లేవ‌ర్ క‌థ‌తో ప‌క్కా తెలంగాన స్లాంగ్ లో సాగిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఊహించ‌ని విజ‌యాన్ని సాధించిన రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఓ విధంగా చెప్పాలంటే ఈ సినిమా సాధించిన వ‌సూళ్ల‌కు ట్రేడ్ వ‌ర్గాలు, ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు విస్మ‌యాన్ని వ్య‌క్తం చేశారు.

చిన్న సినిమాగా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించింది. అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందు హీరోయిన్ నేహా శెట్టి పుట్టుమ‌చ్చ‌ల వివాదం సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్ గా మారి సినిమా మిరంత వైర‌ల్ అయ్యేలా చేసింది. రిలీజ్ కి ముందు జ‌రిగిన ఓ మీడియా కార్య‌క్ర‌మంలో ఓ మీడియా వ్య‌క్తి హీరోయిన్ కు ఎన్ని పుట్టుమ‌చ్చ‌లున్నాయో హీరో లెక్క‌పెట్టాడా? అని అడిగిన తీరు వివాదానికి దారి తీసింది. స‌ద‌రు జ‌ర్నలిస్టు అడిగిన తీరుకు నెటిజ‌న్ ల‌తో పాటు హీరోయిన్ కూడా గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చింది.

దీనిని బ‌ట్టే స‌ద‌రు జ‌ర్న‌లిస్టు త‌న చుట్టూ వున్న మ‌హిళ‌ల‌కు ఎలాంటి గౌర‌వం ఇస్తున్నాడో స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని చుర‌క‌లు అంటించింది. ఇక హీరోయిన్ కు క‌లిగిన అసౌక‌ర్యానికి నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇదిలా వుంటే తాజాగా త‌మిళ హీరో విజ‌య్ న‌టించిన 'బీస్ట్' చిత్రం ఏప్రిల్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రాన్ని నెల్స‌న్ దిలీప్ కుమార్ తెర‌కెక్కించారు. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం హైద‌రాబాద్ లో ప్ర‌త్యేకంగా మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత దిల్ రాజు, ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్‌, సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన దిల్ రాజు చేసిన వ్యాఖ్య‌లు ఇప్ప‌డు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ద‌ర్శ‌కులు ఓ స్క్రిప్ట్ ని రెడీ చేసుకుని అందిరిని మెప్పించడం ఎంతో క‌ష్ట‌మ‌ని చెప్పిన దిల్ రాజు ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఇదే వేదిక‌పై పూజా హెగ్డే గురించి మాట్లాడుతూ 'పూజా మ‌న కాజా' అంటూ ఆమె ఏ ప్రాజెక్ట్ లో లెగ్గుపెడితే అది సూప‌ర్ హిట్ అని, ఈ విష‌యంలో 'బీస్ట్' ఆల్ రెడీ సూప‌ర్ హిట్ అయిపోయింద‌ని, త‌న‌కూ ఓ సూప‌ర్ హిట్ కావాల‌ని, త‌న డేట్స్ ఇస్తే సినిమా చేసుకుంటాన‌ని పూజా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఎదుగుతున్నార‌ని కొనియాడారు. పూజా.. కాజా అంటూ దిల్ రాజు అన్న మాట‌లు ఇప్ప‌డు నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో ఆయ‌న ఇంటెన్ష‌న్ అర్థం చేసుకోలేని కొంత మంది నెటిజ‌న్స్ దిల్ రాజు పై కామెంట్ లు చేస్తున్నారు. నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.

ఏ నిర్మాత అయినా.. డైరెక్ట‌ర్ లేదా హీరో అయినా సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం ఆ ఇంటెన్ష‌న్ తో మాత్ర‌మే మాట్లాడ‌తారే కానీ మ‌రో ఉద్దేశ్యంతో కాద‌న్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల వాద‌న‌. ఇందులో ఖ‌చ్చితంగా నిజం వుంది. దిల్ రాజు పూజా కాజా అన్నారంటే పూజా హెగ్డే కున్న క్రేజ్ ని ఆమెకున్న డిమాండ్ ని మ‌రో ర‌కంగా చెప్పార‌న్న‌ట్టే కానీ ఆమెని కామెంట్ చేయాల‌ని కాద‌న్న‌ది సుస్ప‌ష్టం. దీన్ని బూత‌ద్దంలో చూస్తూ కామెంట్ లు చేయ‌డం స‌రికాద‌ని కొంత మంది చెబుతున్నారు.