Begin typing your search above and press return to search.
రాజు గారు అలా కవర్ చేసుకుంటున్నారు
By: Tupaki Desk | 6 Oct 2017 11:00 PM ISTటాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు ప్రస్తుతం మంచి హిట్ ట్రాక్ లో ఉన్నారు. ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. కానీ ఆయనకు ఊహించని విధంగా స్పైడర్ షాక్ ని ఇచ్చింది. నైజాం లో ఎక్కువగా దిల్ రాజు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఓ వైపు నిర్మాతగా సినిమాలను తీస్తూనే మరో వైపు తన డిస్ట్రిబ్యూషన్ పనులను కూడా కొనసాగిస్తున్నాడు.
అయితే ఈ పండుగకి విడుదలైన మూడు చిత్రాల నైజాం ఏరియా హక్కులను దిల్ రాజే కొనుగోలు చేశాడు. అందులో మొదట జై లవకుశ ఆయనకు నష్టాలను రాకుండా చూసుకుంది. కానీ వారం తర్వాత విడుదలైన స్పైడర్ మాత్రం దిల్ రాజుకి కోలుకోలేని దెబ్బను తీసిందని తెలుస్తోంది. స్పైడర్ నైజాం హక్కులను భారీ మొత్తం వెచ్చించి దక్కించుకున్న దిల్ రాజు 13 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది. నైజాం ఏరియాల్లో ఎప్పుడు విడుదల కానీ విధంగా మహేష్ - స్పైడర్ రిలీజ్ అయ్యింది. అలాగే అంచనాలు కూడా బాగా ఉండడంతో కలెక్షన్స్ వస్తాయని అనుకున్నారు. కానీ సినిమా అనుకున్నంతగా లేకపోవడంతో నష్టపోవాల్సి వచ్చింది.
ఇక దిల్ రాజు మహానుభావుడు సినిమాను కూడా నైజాం లో రిలీజ్ చేశాడు. అయితే ఆ సినిమా కొనుగోలు చేసినదానికంటే ఎక్కువనే రాబట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ లో స్పైడర్ కి డివైడ్ టాక్ రావడంతో మహానుభావుడు 30 థియేటర్లను లాగేసుకున్నాడు. దానితో స్పైడర్ తెచ్చిన నష్టాన్ని మహానుభావుడుతో కవర్ చేసుకుంటున్నాడు దిల్ రాజు. ఇకపోతే త్వరలోనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ చేయబోయే కొత్త చిత్రానికి అశ్విని దత్ తో కలిసి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఈ బడా ప్రొడ్యూసర్.