Begin typing your search above and press return to search.

స‌మంత ఆ భ‌యం వ‌ల్లే ఈవెంట్ ని క్యాన్సిల్ చేయించిందా?

By:  Tupaki Desk   |   27 Oct 2022 9:30 AM GMT
స‌మంత ఆ భ‌యం వ‌ల్లే ఈవెంట్ ని క్యాన్సిల్ చేయించిందా?
X
స‌మంత న‌టిస్తున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'య‌శోద‌'. గ‌త కొంత కాలంగా ప‌లు కార‌ణాల వ‌ల్ల వ‌రుస‌గా రిలీజ్ వాయిదాప‌డుతూ వ‌స్తున్న ఈ యూవీ ఎట్ట‌కేల‌కు న‌వంబ‌ర్ 11న భారీ స్థాయిలో వ‌రల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో బైలింగ్వ‌ల్ మూవీగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా ఐదు భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ద్వారా హ‌రి, హ‌రీష్ ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం అవుతున్నారు. శ్రీ‌దేవి మూవీస్ బ్యాన‌ర్ పై శివ‌లెంక కృష్ణ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. ప‌లు ద‌ఫాలుగా రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌చ్చిన‌ ఈ మూవీని ఫైన‌ల్ గా న‌వంబ‌ర్ 11న విడుద‌ల చేస్తున్నామంటూ ఇటీవ‌ల చిత్ర బృందం ఈ మూవీ రిలీజ్ డేట్ ని వినూత్నంగా ప్రేక్ష‌కుల చేత ప్ర‌క‌టించి సినిమా ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్టింది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ట్రైల‌ర్ ని గురువారం ఈ నెల 27న భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇందు కోసం భారీ ఏర్పాట్లు చేశారు.

తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, త‌మిళంలో సూర్య‌, మ‌ల‌యాళంలో దుల్క‌ర్ స‌ల్మాన్‌, క‌న్న‌డ‌లో ర‌క్షిత్ శెట్టి, హిందీలో వ‌రుణ్ ధావ‌న్ ట్రైల‌ర్ ని గురువారం సాయంత్రం 5:36 నిమిషాల‌కు విడుద‌ల చేయబోతున్నారు.

తెలుగులో విజ‌చ్ దేవ‌ర‌కొండ గెస్ట్ గా ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశార‌ట‌. అయితే స‌మంత మాత్రం చివ‌రి నిమిషంలో ఈవెంట్ ని క్యాన్సిల్ చేయించింద‌ని తెలుస్తోంది. దీంతో చేసేదేమీ లేక మేక‌ర్స్ ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్ ని ర‌ద్దు చేసి సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రైల‌ర్ ని రిలీజ్ చేస్తున్నార‌ట‌.

ఈ మూఈ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటాన‌ని మేక‌ర్స్ కి మాటిచ్చిన స‌మంత ఉన్న‌ట్టుండి ఈవెంట్ ని క్యాన్సిల్ చేయ‌డం ప‌లువుర‌ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. అయితే సామ్ కావాల‌నే ఈవెంట్ ని క్యాన్సిల్ చేయించింద‌ని, ఈవెంట్ జ‌రిగితే మీడియా అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల్సి వ‌స్తోంద‌నే ఇలా చేసింద‌ని అంటున్నారు. ఇటీవ‌ల సమంత ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో పాటు స్కిన్ ఎల‌ర్జీ కార‌ణంగా కాస్మెటిక్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లిందంటూ వార్త‌లు జోరుగా వినిపించిన విషయం తెలిసిందే.

ఈ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని సామ్ మేనేజ‌ర్ ప్ర‌క‌టించినా సామ్ మాత్రం యుఎస్ కి వెళ్లిరావ‌డంతో పుకార్ల‌కు మ‌రింత ఊత‌మిచ్చిన‌ట్ట‌యింది. దీంతో ఈ విష‌యంలో 'య‌శోద‌' ట్రైల‌ర్ ఈవెంట్ కార‌ణంగా మీడియాకు అడ్డంగా బుక్క‌య్యే అవ‌కాశం వుంద‌ని గ్ర‌హించిన స‌మంత ఉన్న‌ట్టుండి ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేయించింద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

ఈవెంట్ క్యాన్సిల్ చేస్తుంది స‌రే సినిమా రిలీజ్ టైమ్ లో ప్ర‌మోష‌న్స్ కోసం అయినా మీడియా ముందుకు రావాల్సిందే క‌దా.. అప్పుడు సామ్ త‌ప్పించుకోవ‌డానికి కుద‌ర‌దు క‌దా? ఈ లాజిక్ ని సామ్ ఎలా మిస్స‌వుతోంద‌నేనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.