Begin typing your search above and press return to search.

ఈటీతో మరో హిట్ అందుకుంటాడా..?

By:  Tupaki Desk   |   26 Feb 2022 7:59 PM IST
ఈటీతో మరో హిట్ అందుకుంటాడా..?
X
'ఆకాశమే హద్దురా' 'జై భీమ్' వంటి బ్యాక్ టూ బ్యాక్ ఓటీటీ రిలీజుల తర్వాత తమిళ హీరో సూర్య నుంచి థియేటర్లలోకి రాబోతున్న తాజా చిత్రం ''ఈటీ'' (ఎత్తారెక్కుమ్ తునిందవన్). పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఏర్పరచుకున్న సూర్య ఈ చిత్రాన్ని 'ఈటీ' (ఎవరికీ తలవంచడు) అనే పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా 2022 మార్చి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు 'ఈటీ' చిత్రం నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు - పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. 'చుర్రు చుర్రని' అనే పెప్పీ డ్యాన్స్ నంబర్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇందులో సూర్య - హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు అలరిస్తున్నాయి.

సూర్య కెరీర్ లో 40వ సినిమాగా వస్తున్న 'ఈటీ' కి పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య ఊర మాస్ పాత్రలో కనిపించనున్నారు. సత్యరాజ్ - సూరి - జయప్రకాశ్ - శరణ్య పొన్వన్నన్ - వినయ్ రాయ్ - సుబ్బు పంచు - దేవదర్శిని - ఎం.ఎస్ భాస్కర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

డి. ఇమ్మాన్ సంగీతం సమకూర్చారు. ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించగా.. జాకీ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మార్చి 11న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' మూవీ రిలీజ్ అవుతుండగా.. ఒక్కరోజు ముందు ''ఈటీ'' చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. మరి బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ చిత్రానికి పోటీగా సూర్య ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.