Begin typing your search above and press return to search.

'డీజే' వాయింపుకు బాక్సాఫీస్ రికార్డు మోత

By:  Tupaki Desk   |   14 Feb 2022 4:28 AM GMT
డీజే వాయింపుకు బాక్సాఫీస్ రికార్డు మోత
X
2022 సంవత్సరంలో ఇప్పటి వరకు విడుదల అయిన సినిమాల్లో టాప్ చిత్రంగా డీజే టిల్లు నిలిచింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన డీజే టిల్లు సినిమా కు భారీ ఓపెనింగ్స్ దక్కాయి. సినిమా కు వచ్చిన పాజిటివ్‌ రెస్పాన్స్ తో మొదటి రెండు రోజుల్లోనే దాదాపు అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్‌ ఈవెన్‌ ను సాధించిందనే వార్తలు వస్తున్నాయి. నైజాం ఏరియాలో మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ తోనే బ్రేక్‌ ఈవెన్‌ ను సాధించినట్లుగా సమాచారం అందుతోంది.

ఇక ఆది వారం నుండి వచ్చిన ప్రతి పైసా కూడా నిర్మాతకు మరియు బయ్యర్లకు లాభమే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ సినిమా యూఎస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ ను దక్కించుకుంది. కేవలం ప్రీమియర్స్ ద్వారానే ఈ సినిమా బయ్యర్లు పెట్టిన పెట్టుబడిలో సగం వరకు రాబట్టినట్లుగా తెలుస్తోంది. అక్కడ కూడా శని ఆదివారాల్లో కలిపి భారీగా వసూళ్లు రాబట్టి బ్రేక్‌ ఈవెన్‌ ను సాధించినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఈమద్య కాలంలో వచ్చిన ఏ సినిమాకు దక్కని అరుదైన రికార్డు ఈ సినిమాకే దక్కింది. కేవలం రెండు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది.

కొన్ని సినిమాలు మొదటి రెండు రోజుల్లో కొన్ని చోట్ల బ్రేక్‌ ఈవెన్‌ సాధించి ఉండవచ్చేమో కాని ఈ సినిమా మాత్రం అన్ని ఏరియాల్లో కూడా మొదటి రెండు రోజుల్లో బ్రేక్‌ ఈవెన్‌ ను సాధించి రికార్డును నమోదు చేసింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా పై మొదటి నుండే పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ అయ్యింది. ఆ బజ్ కారణంగానే సినిమా భారీ వసూళ్లు నమోదు చేసింది అనడంలో సందేహం లేదు. డీజే టిల్లు సినిమా ఖిలాడికి పోటీగా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా నిరాశ పర్చడంతో ఈ సినిమాకు కలిసి వచ్చింది.

సిద్దు జొన్నలగడ్డ నటన మరియు డైలాగ్స్ యూత్‌ కు బాగా కనెక్ట్‌ అయ్యాయి. థియేటర్లలో కొన్ని నెలలుగా ఇతర సినిమాలు ఏమీ లేకపోవడంతో ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా డీజే వైపు మొగ్గు చూపుతున్నారు. ముద్దు సన్నివేశాలు మాత్రమే కాకుండా కాస్త రొమాంటిక్ టచ్ ఉన్న సన్నివేశాలు చాలానే ఉన్నాయంటూ ట్రైలర్‌ చూస్తే క్లారిటీ వచ్చింది. మరీ బూతుగా లేకపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మౌత్‌ పబ్లిసిటీ చేస్తూ సినిమాకు మరింత పాపులారిటీ దక్కేలా చేస్తున్నారు.

డీజే సిద్దు సినిమా మంచి వసూళ్లను నమోదు చేస్తూ దూసుకు వెళ్తున్న ఈ సమయంలో ఈ ఏడాది మేటి సినిమాగా ఇప్పటి వరకు నిలిచిన బంగార్రాజు రికార్డు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఏడాదిలో డీజే గాడికి ముందు వచ్చిన సినిమాల్లో బంగార్రాజు సినిమా టాప్‌. దాదాపుగా 50 కోట్ల వసూళ్లు దక్కించుకున్న ఆ సినిమా లాంగ్‌ రన్ లో దాదాపు అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్‌ దక్కించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ రికార్డును ఓపెనింగ్స్ విషయంలో డీజే టిల్లు క్రాస్ చేసింది. ఖిలాడి సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కినా రెండవ రోజు నుండే టిల్లు గాడి రాకతో సందడి తగ్గింది.

ఈ వారం మాత్రమే కాకుండా వచ్చే వారంలో కూడా డీజే టిల్లు సినిమా సందడి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కరోనా కేసులు తగ్గడంతో పాటు ఆంక్షలు కూడా తొలగి పోయాయి. దాంతో జనాలు థియేటర్లకు బారులు తీరుతున్నారు. పెద్ద ఎత్తున డీజే టిల్లు సినిమాను చూసే అవకాశాలు ఉన్నాయి. కనుక సితార ఎంటర్ టైన్మెంట్స్ వారికి డీజే టిల్లు సినిమా తో భారీ వసూళ్లు నమోదు అవ్వబోతున్నాయి. ఖచ్చితంగా లాంగ్ రన్‌ లో అరుదైన రికార్డులను కూడా ఈ సినిమా దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.