Begin typing your search above and press return to search.

మోష‌న్ పోస్ట‌ర్ టాక్‌ : ఆడించే శివుడొచ్చాడు!

By:  Tupaki Desk   |   30 Nov 2022 6:00 AM GMT
మోష‌న్ పోస్ట‌ర్ టాక్‌ : ఆడించే శివుడొచ్చాడు!
X
'Rx100' సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకుని హీరోగా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు కార్తికేయ గుమ్మ‌కొండ‌. అయితే ఈ మూవీ త‌రువాత మాత్రం ఆ స్థాయి స‌క్సెస్ ని ద‌క్కించుకోలేక విల‌న్‌గా, హీరోగా న‌టిస్తూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నాడు. అజిత్ న‌టించిన 'వ‌లిమై'లో విల‌న్ గా న‌టించి ఆక‌ట్టుకున్న కార్తికేయ ఇప్ప‌డు హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'బెదురులంక 2012'. క్లాక్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కొత్త త‌ర‌హా క్రైమ్ థ్రిల్ల‌ర్స్‌, మ‌ర్డ‌ర్ మిస్ట‌రీల‌కు పూర్తి భిన్నంగా తెర‌కెక్కుతున్న మూవీ ఇది.

ఈ మూవీని లౌక్య ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని నిర్మిస్తున్నారు. 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇటీవ‌లే ఈ మూవీకి 'బెదురులం 2012' అనే టైటిల్ ని ఖ‌రారు చేసిన చిత్ర బృందం తాజాగా బుధవారం ఈ మూవీ మోష‌న్ పోస్ట‌ర్ ని హీరో నేచుర‌ల్ స్టార్ చేత రిలీజ్ చేయించింది. యుగాంతం 2012 నేప‌థ్యంలో సాగే ఎంట‌ర్ టైన‌ర్ ఇది. ఇందులో హీరో కార్తికేయ కొత్త త‌ర‌హా పాత్ర‌లో న‌టిస్తున్నాడు. కనివిని ఎరుగని ఆట ఇది.. ఆట‌గాళ్లు ఎంద‌రున్నా ఆడించేది ఈ శివుడే అంటూ కొత్త క‌థ‌తో కార్తికేయ వ‌స్తున్నాడు.

ఇంత‌కీ ఈ మాయా చ‌ద‌రంగంలో శివుడు ఆడే ఆట ఏంటీ?.. యుగాంతానికి ఈ ఆట‌కూ వున్న సంబంధం ఏంటీ? ..ఇందులో శివుడు ఎలా గెలిచాడు? .. అంద‌రిని చిత్తు చేశాడ‌న్న‌దే ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తోంది. మోష‌న్ పోస్ట‌ర్ లో ఓ వాయిస్ 'శివుడొచ్చాడ్రా అంటున్న తీరు.. కాల చ‌క్రం.. కార్తికేయ చేతిలో మాయా పాచిక‌లు.. వెర‌సి 'బెదురులంక 2012' మోష‌న్ పోస్ట‌ర్ ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్ టైన్ మెంట్ తో ఈ మూవీ సాగ‌నున్న‌ట్టుగా తెలుస్తోంది.

యుగాంతం చుట్టూ అల్లుకున్న క‌థ కావ‌డంతో పాత్ర‌ల చుట్టూ కావాల్సిన డ్రామా వుండే అవ‌కాశం వుంద‌ని, దాని ద్వారా ప్రేక్ష‌కుల‌కు కావాల్సిన ఫ‌న్ జ‌న‌రేట్ కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ది బిగ్గెస్ట్ హోక్స్ ఎవ‌ర్ ప్లేయిడ్ అంటూ ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ఈ మూవీతో కార్తికేయ ఈ సారి ఖ‌చ్చితంగా కొట్టేలా వున్నాడు.

మోష‌న్ పోస్ట‌ర్ కొత్త‌గా వుండ‌టంతో స‌ర్వ‌త్రా పాజిటివ్ రెస్సాన్స్ ల‌భిస్తోంది. నాన్ స్టాప్ ఫ‌న్‌, హ్యూమ‌న్ ఎమోష‌న్స్ నేప‌థ్యంలో సాగే ఈ మూవీలో యాక్ష‌న్ కూడా ప్ర‌ధాన హైలైట్ గా నిల‌వనుంద‌ట‌.

ఈ మూవీకి మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. గోదావ‌రి నేప‌థ్యంలో సాగే ఈ మూవీకి సాయి ప్ర‌కాష్ ఛాయాగ్ర‌హ‌ణం, సుధీర్ మాచ‌ర్ల ఆర్ట్‌, విప్ల‌వ్ నైషాడం ఎడిటింగ్ అందిస్తున్నారు. అజ‌య్ ఘోష్‌, స‌త్య‌, రాక్ కుమార్ క‌సిరెడ్డి, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ఆటో రామ్ ప్ర‌సాద్‌, గోప‌రాజు ర‌మ‌ణ‌, ఎల్బీ శ్రీ‌రామ్‌, సుర‌భి ప్ర‌భావ‌తి, కిట్ట‌య్య త‌దిత‌రులు న‌టిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.