Begin typing your search above and press return to search.

తెలుగు మహా సభల్లో బాలయ్య ఛాలెంజ్

By:  Tupaki Desk   |   19 Dec 2017 4:43 PM IST
తెలుగు మహా సభల్లో బాలయ్య ఛాలెంజ్
X
టాలీవుడ్ హీరోల్లో తెలుగు మీద మంచి పట్టు.. భాషలో మంచి పాండిత్యం ఉన్నది నందమూరి బాలకృష్ణకే. అనేక వేదికల్లో తన భాషా పాండిత్యాన్ని చూపించాడు బాలయ్య. ఐతే తన పాండిత్యాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టడంలో.. సందర్భానికి తగ్గట్లు తన భాషా ప్రావీణ్యాన్ని ప్రదర్శించడంలోనే ఆయన విఫలమవుతుంటారు. ఐతే బాలయ్యకు ఈ విషయంలో ఇప్పుడో చక్కటి వేదిక దొరికింది. తెలుగు మహా సభల్లో భాగంగా బాలయ్యకు ప్రసంగించే అవకాశం దొరగ్గా.. ఆయన సరైన ప్రిపరేషన్ తో వచ్చి చక్కటి ప్రసంగం చేశాడు. ఈ వేడుకల్లో బాలయ్య ప్రసంగం బాగా హైలైట్ అయింది.

ఈ ప్రసంగంలో భాగంగా మూడు నిమిషాలు ఒక్క పరాయి పదం రాకుండా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా అంటూ బాలయ్య సవాలు విసరడం విశేషం. తెలుగు భాష గురించి బాలయ్య కవితాత్మకంగా చెప్పిన తీరు ఆకట్టుకుంది. కమ్మనైన తెలుగు భాషలో గోదావరి వంపులున్నాయని.. తెలంగాణ మాగాణం తెలుగు భాష అని.. రాయలసీమ పౌరుషం తెలుగులో ఉంటుందని.. కోనసీమ కొబ్బరి నీళ్ల లేతదనం తెలుగు భాషలో ఉందని అంటూ అన్ని ప్రాంతాలనూ కవర్ చేశాడు బాలయ్య. తెలుగు జాతికి గౌరవం దక్కాలంటే ముందు తెలుగు భాషను గౌరవించాలని బాలయ్య అన్నాడు. ప్రాంతాలు వేరైనా తెలుగు ప్రజలంతా స్నేహ భావాన్ని వీడలేదని.. ఇది ఎప్పటికీ అలాగే కొనసాగాలని బాలయ్య కోరాడు. వీర తెలంగాణ పుత్రులకు, విప్లవ తెలంగాణ ఆడబిడ్డలకు నా కళాభివందనాలు అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టి.. తెలంగాణలో పుట్టిన వారికి అభిమానించడం తెలుసని.. ఎదురించడం తెలుసని బాలయ్య ఈ ప్రాంత వాసుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తెలుగు పదం వింటే తన తనువు పులకిస్తుంద.. ఐదువేల ఏళ్ల కిందటే తెలుగు జాతి ప్రారంభమైందని.. ఒక మహనీయుడు చెప్పినట్లు మాతృభాష తల్లి పాల వంటిదని.. పరాయి భాష డబ్బా పాలవంటిదని.. డబ్బా పాలపై మోజుతో అమ్మను అమ్మా అని పిలవలేకపోతున్నారని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశఆడు. మమ్మీ డాడీ సంస్కృతి నానాటికీ పెరిగిపోతోందని.. ఇరవై ఏళ్లు పోతే ఇవే తెలుగు పదాలేమో అనే నమ్మే దౌర్భాగ్యం వస్తుందని బాలయ్య ఆందోళన వ్యక్తం చేశాడు.