Begin typing your search above and press return to search.

కాంట్ర‌వ‌ర్శీ క్వీన్ పై బాంబ్..మ‌రో క్రిమిన‌ల్ కేసుతో ఉక్కిరిబిక్కిరి!!

By:  Tupaki Desk   |   23 Oct 2020 2:40 PM IST
కాంట్ర‌వ‌ర్శీ క్వీన్ పై బాంబ్..మ‌రో క్రిమిన‌ల్ కేసుతో ఉక్కిరిబిక్కిరి!!
X
వివాదం కేరాఫ్ కంగ‌న‌.. ముంబై శివ‌సేన‌తో కంగ‌న ఫిక‌ర్ తెలిసిన‌దే. కొన్ని వ‌రుస ఈవెంట్ల అనంత‌రం కంగ‌న‌పై శివ‌సేన వీరంగం ప్ర‌తీకార త‌డాఖా అంత‌కంత‌కు హీటెక్కిస్తోంది. ఇప్ప‌టికే కంగ‌న‌పై క్రిమిన‌ల్ కేసులు అక్ర‌మ క‌ట్ట‌డం కేసులు భ‌నాయించి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న శివ‌సేన ఆధిప‌త్యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అయితే ఎవ‌రేం చేసినా తాను ఎక్క‌డా త‌గ్గ‌ను! అంటూ ఢీకొడుతోంది క్వీన్ కంగ‌న. ఒక ర‌కంగా మ‌ణిక‌ర్ణిక‌కు ఒరిజిన‌ల్ రూపం నాదేన‌ని నిరూపిస్తోంది.

ఇంత‌కుముందు కంగ‌న -రంగోలి సిస్ట‌ర్స్ ని విచారించేందుకు ముంబై పోలీసులు కాల్ చేసిన సంగ‌తి తెలిసిన‌దే. సిస్ట‌ర్స్ ని ముంబై పోలీసులు పిలిపించి కొద్ది రోజులైనా కాలేదు. ఇంత‌లోనే కంగ‌న‌పై మరో క్రిమినల్ ఫిర్యాదు అందింది. ప్ర‌ముఖ జాతీయ మీడియా క‌థ‌నం ప్రకారం.. ముంబై పోలీసులపై `అవమానకరమైన వ్యాఖ్యలు` చేసినందుకు కంగ‌న‌పై క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసులో పోలీసులపై కంగనా చేసిన వ్యాఖ్యలకు నగరానికి చెందిన న్యాయవాది ఫిర్యాదు చేయ‌డంతో ఈ కేసును న‌మోదు చేశారు.

కంగన ``మన దేశాన్ని.. దేశంలో పోలీసులను.. అధీకృత ప్రభుత్వ సంస్థలను.. ఎగ్జిక్యూటివ్ మెషినరీలను అవ‌మానించింది. భారతదేశంలో చట్టం ద్వారా స్థాపించబ‌డిన వాటికి అవమానం జ‌రిగింది`` అని న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వివిధ వర్గాల మధ్య దేశద్రోహం .. శత్రుత్వాన్ని ప్రోత్సహించే ఆరోపణలు ఈ ఫిర్యాదులో ఉన్నాయి.

అయితే కంగనా ఈ వార్తలకు వెంట‌నే స్పందిస్తూ త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డింది. ``కాండిల్ మార్చిన‌ ముఠా... గ్యాంగ్ డెఖో ఇదే ఫాసిస్ట్ స్థాపన.. తుమ్కో కోయి పూచ్చా భీ నహిన్.. నన్ను చూడండి నా జీవితానికి ఒక అర్ధం ఉంది. మహారాష్ట్రలో నిజమైన ఫాసిస్ట్ ప్రభుత్వంతో పోరాడటమే ప‌ర‌మార్థం. మీ అందరిలా మోసగ‌త్తెను కాదు`` అంటూ త‌న‌దైన శైలిలో కంగ‌న చెల‌రేగింది. తాజా ప్ర‌క‌ట‌న‌లో జైలుకు వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు. . జై హింద్, నా జీవితానికి ఒక అర్ధాన్ని ఇస్తున్నాను! అంటూ కంగ‌న వీరావేశం చూపించ‌డం సంచ‌ల‌న‌మైంది. జాతీయ మీడియా నివేద‌న ప్ర‌కారం... కంగనపై ఈ కేసుల వ్య‌వ‌హారం.. నవంబర్ 10 న విచారణకు రానుంది.