Begin typing your search above and press return to search.

'ఆచార్య' సాంగ్ ప్రోమో: ‘లాహే లాహే’లో బాసు గ్రేసు చూపించాడుగా..!

By:  Tupaki Desk   |   30 March 2021 1:58 PM GMT
ఆచార్య సాంగ్ ప్రోమో: ‘లాహే లాహే’లో బాసు గ్రేసు చూపించాడుగా..!
X
తండ్రీకొడుకులు మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ కలిసి నటిస్తున్న చిత్రం ''ఆచార్య''. కొరటాల శివ తనదైన శైలిలో సందేశాత్మక అంశాలకు కమర్షియల్ హంగులు జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మే 13న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ చేస్తున్న చిత్ర యూనిట్ ఇప్పటికే ఫస్ట్ లుక్ - టీజర్ - చరణ్ 'సిద్ద' లుక్‌ లను విడుదల చేసారు. ఈ క్రమంలో తాజాగా ‘లాహే లాహే’ అనే ఓ హుషారైన గీతం ప్రోమోని రిలీజ్ చేశారు.

కేవలం మ్యూజిక్ బీట్ ఉండేలా వదిలిన 'లాహే లాహే' పాట ప్రోమోలో మెగాస్టార్ డ్యాన్స్ తో అదరగొట్టాడు. వీణ పట్టకుని ఉన్న హరిదాసులతో కలసి చిరంజీవి వేసిన స్టెప్స్.. వీణ స్టెప్స్ వేసిన వింటేజ్ చిరుని గుర్తు చేస్తోంది. ఆరు పదుల వయసు దాటినా నా గ్రేస్ తగ్గలేదని బాస్ ఈ సాంగ్ తో ప్రూవ్ చేస్తున్నారు. దీనికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సమకూర్చిన వీణ ట్యూన్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఈ సాంగ్ పూర్తి లిరికల్ వీడియోను రేపు (మార్చి 31) సాయంత్రం గం. 4.05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ధర్మస్థలిలో ఆచార్య వేసిన స్టెప్పులు ఎలా ఉంటాయో రేపు తెలియనుంది. 'ఆచార్య' చిత్రానికి తిరు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.