Begin typing your search above and press return to search.

ప్రపంచ రికార్డు కటవుట్ కు కొత్త ట్విస్ట్

By:  Tupaki Desk   |   31 May 2019 9:56 AM IST
ప్రపంచ రికార్డు కటవుట్ కు కొత్త ట్విస్ట్
X
సినిమా హీరోల అభిమానం కొత్త పుంతలు తొక్కడానికి తమిళ ఫాన్స్ ని మించిన ఉదాహరణలు ప్రపంచంలో వేరెక్కడా దొరకవేమో. ఈ రోజు విడుదలైన సూర్య ఎన్జికెను పురస్కరించుకుని సూర్య ఫ్యాన్స్ 215 అడుగుల ప్రపంచంలోనే అతి పెద్ద కటవుట్ ని పెట్టిన సంగతి తెలిసిందే. కాని మొదటి షో పడకుండానే ఆ ఆనందం వాళ్ళకు నిలవలేదు. అనుమతి తీసుకోకుండా పెట్టినందుకు కార్పోరేషన్ వాళ్ళు దాన్ని తొలగించారు.

అంత పెద్ద కటవుట్ జనావాసాల మధ్య ఉండటం చాలా ప్రమాదమని ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి గాలి వానకో లేక ఇంకేదైనా కారణానికో కింద పడితే తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండటంతో ఈ కఠిన చర్యకు పూనుకున్నారు. ఇది సూర్య ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచినా ఒప్పుకోక తప్పలేదు

తమిళనాడులో ఇవాళ తెల్లవారుఝామున 5 గంటలకే మొదలైన ఎన్జికేకు తెలుగులో మాత్రం ఆ స్థాయిలో సగం స్పందన కూడా లేదు. టాక్ ని నమ్ముకుని తర్వాత పికప్ అవుతుందనే ధీమాతో ఉన్నారు తెలుగు ఫ్యాన్స్. విడుదల పరంగా మంచి సంఖ్యలో స్క్రీన్లు దక్కినప్పటికీ ఇప్పటికే డౌన్ లో ఉన్న సూర్య తెలుగు మార్కెట్ ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తోంది.

ఫలక్ నుమా దాస్ తప్ప చెప్పుకోదగ్గ పోటీ ఏదీ లేనప్పటికీ కాస్త స్లోగానే సూర్య ఖాతా తెరవబోతున్నాడు. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే పికప్ ని ఆశించవచ్చు. యావరేజ్ అన్నా లాభం లేదు. పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి ఎంతమేరకు ఎన్జికె తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తాడో వేచి చూడాలి. సాయి పల్లవి రకుల్ ప్రీత్ సింగ్ హీరొయిన్లు నటించిన ఈ మూవీకి శ్రీరాఘవ దర్శకుడు