Begin typing your search above and press return to search.

13 ఏళ్ళ రీఎంట్రీ.. 'కాథల్' సెట్లో జ్యోతిక సందడి..!

By:  Tupaki Desk   |   28 Oct 2022 7:30 AM GMT
13 ఏళ్ళ రీఎంట్రీ.. కాథల్ సెట్లో జ్యోతిక సందడి..!
X
తమిళ స్టార్ హీరోయిన్ జ్యోతిక టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచతమే. సీనియర్ హీరోయిన్ నగ్మా చెల్లెలిగా జ్యోతికకు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. అలాగే మాస్ మహారాజా రవితేజ సరసన 'షాక్'.. కింగ్ నాగార్జునతో 'మాస్'.. మెగాస్టార్ చిరంజీవికి జోడిగా 'ఠాగూర్' సినిమాల్లో నటించి సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.

అలాగే తమిళంలో జ్యోతిక నటించిన పలు సినిమాలు తెలుగులోనూ డబ్బింగ్ అవుతుంటాయి. దీంతో ఈ భామకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తమిళ స్టార్ హీరో సూర్యను వివాహం చేసుకున్న తర్వాత జ్యోతిక కొద్దిరోజులు సినిమాలకు గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత నుంచి హీరోయిన్ ఓరియేంటేడ్.. లీడ్ రోల్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.

2019లో 'రాక్షసి'..'జాక్ పాట్'.. 'తంబీ'..'పొన్మంగల్ వందల్' వంటి తమిళ సినిమాల్లో నటించింది. 'తంబీ' సినిమా తెలుగులో 'దొంగ'గా డబ్బింగై సూపర్ హిట్ అయింది. 2021లో జ్యోతిక నటించిన 50వ సినిమాగా 'Udanpirappe' అమెజాన్ ప్రైమ్ లో రిలీజైంది. ఇక 2022లో 'కాథల్' అనే మలయాళ సినిమాలో జ్యోతిక నటిస్తోంది.

దాదాపు 13 ఏళ్ల తర్వాత జ్యోతిక మలయాళంలో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ సినిమాను మమ్ముట్టి కంపెనీ.. వేఫేరర్‌ ఫిలిమ్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' దర్శకుడు జో బేబీ తెరకెక్కిస్తుండగా మాథ్యూస్‌ పులిక్కన్‌ సంగీతం సమకూరుస్తున్నాడు.

'కాథల్' మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ నేపథ్యంలోనే జ్యోతిక గురువారం రోజు షూటింగ్ పాల్గొని సందడి చేసింది. జ్యోతికపై పలు కీలక సన్నివేశాలను దర్శకుడు జో బేబీ చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. జ్యోతిక-మమ్ముట్టి కలిసి ఉన్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.