Begin typing your search above and press return to search.

విశ్వక్ GOG.. ట్రైలర్ రచ్చకు సిద్ధమా..

ఆలస్యం అయినా కూడా అంచనాలు ఏమాత్రం తగ్గగలేదు.

By:  Tupaki Desk   |   22 May 2024 2:17 PM GMT
విశ్వక్ GOG.. ట్రైలర్ రచ్చకు సిద్ధమా..
X

విశ్వక్ సేన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం, అనేక కారణాల వల్ల విడుదల తేదీలు మారుస్తూ వచ్చింది. మొదట షూటింగ్ పనులు కొంత ఆలస్యం కాగా, తరువాత ఎన్నికల కారణంగా విడుదల తేదీ మరోసారి మార్చబడింది. అయినప్పటికీ, ఈ చిత్రం మొదటి నుంచి ఒకే తరహాలో మంచి బజ్ క్రియేట్ చేసుకుంటోంది. ఆలస్యం అయినా కూడా అంచనాలు ఏమాత్రం తగ్గగలేదు. చివరికి మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను గ్రాండ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇప్పటికే పాటలతో సెన్సేషన్ క్తియేట్ చేసిన GOG సినిమా టీజర్ తో కూడా హైప్ క్రియేట్ చేసుకుంది. ఇక మే 25న పవర్ఫుల్ ట్రైలర్ విడుదల కానుంది. హైదరాబాద్ లోని RTC క్రాస్ రోడ్స్ లో ఉన్న ప్రఖ్యాత దేవి 70 MM థియేటర్‌లో సాయంత్రం 04:06 PM కి ఈ ట్రైలర్ లాంచ్ జరుగుతుంది.

ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు మొత్తం టీమ్ హాజరు కానుంది. నాగ వంశీ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామాలో విశ్వక్ సేన్ సరసన తాజా సంచలనం నేహా శెట్టి, టాలెంటెడ్ బ్యూటీ అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన టీజర్ అద్భుతంగా ఉండటం ద్వారా సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ చిత్రంలో నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ, హైపర్ ఆది వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. హిందీ బిగ్ బాస్‌ సెన్సేషన్ ఆయేషా ఖాన్‌ ఒక ప్రత్యేక పాటలో నటించనుంది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో ఒక హై బడ్జెట్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది.

అద్భుతమైన పాత్రలతో, విజువల్స్ మరియు యాక్షన్ సీన్స్ తో "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" ప్రేక్షకులను ఆకట్టుకునే విదంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు కృష్ణ చైతన్య, నిర్మాత నాగ వంశీ మరియు ఇతర టీమ్ సభ్యులు ఈ సినిమాను ఎంతగానో కష్టపడి తీర్చిదిద్దినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా మే 31న విడుదలవుతున్న నేపథ్యంలో, ప్రేక్షకులు, అభిమానులు, సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ విడుదలతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరి "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" ఆడియన్స్ ను ఎలాంటి ఎంటర్టైన్ మెంట్ అందిస్తుందో, విశ్వక్ సేన్ ఈ పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలి.