Begin typing your search above and press return to search.

జ‌క్క‌న్న హీరోలు కేవ‌లం మ‌నోళ్లేనా?

ఆయ‌న‌లో ఈ ప్ర‌తిభ‌ని మెచ్చిన కొంత మంది బాలీవుడ్ దర్శ‌క‌-నిర్మాత‌లు హిందీ ప‌రిశ్ర‌మకి తీసుకెళ్లాల‌ని ప్ర‌య‌త్నించారు.

By:  Tupaki Desk   |   3 Nov 2023 5:30 PM GMT
జ‌క్క‌న్న హీరోలు కేవ‌లం మ‌నోళ్లేనా?
X

రాజ‌మౌళిది టాలీవుడ్...బాలీవుడ్ దాటి హాలీవుడ్ రేంజ్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న డైరెక్ట్ చేసిన హీరోల‌కి హాలీవుడ్ లోనే అవ‌కాశాలు వ‌స్తున్నాయి. మ‌రి అలాంటి మేక‌ర్ కి ప్ర‌య‌త్నిస్తే హాలీవుడ్ లో అవ‌కాశాలు రావా? అంటే అందుకు నో చెప్ప‌డానికి లేదు. సాధార‌ణ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన జ‌క్క‌న్న 'బాహుబ‌లి'..'ఆర్ ఆర్ ఆర్' లాంటి విజువ‌ల్ వండ‌ర్స్ తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ఏర్ప‌రుచుకున్నారు.

ఆయ‌న‌లో ఈ ప్ర‌తిభ‌ని మెచ్చిన కొంత మంది బాలీవుడ్ దర్శ‌క‌-నిర్మాత‌లు హిందీ ప‌రిశ్ర‌మకి తీసుకెళ్లాల‌ని ప్ర‌య‌త్నించారు. అమీర్ ఖాన్ సైతం బాహాటంగానే రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఉంద‌ని మ‌న‌సులో కొర్కెను బ‌య‌ట పెట్టారు. ఇంకా జ‌క్క‌న్న‌తో ప‌నిచేయ‌డానికి దేశంలో స్టార్లు అంద‌రూ సిద్దంగానే ఉన్నారు. కానీ రాజ‌మౌళి మాత్రం అటువైపు గా చూసింది లేదు. మాతృభాష‌పై మ‌మ‌కారంతో ఇక్క‌డి స్టార్ల‌నే ప్ర‌పంచం దృష్టిలో ప‌డేలా చేస్తున్నారు.

ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. అయితే రాజ‌మౌళి హీరోలు కేవ‌లం తెలుగు న‌టులేనా? ఇత‌ర భాష‌ల న‌టుల‌కు ఆయ‌న అవ‌కాశాలు ఇవ్వ‌రా? అన్న‌ది కొత్త‌గా రెయిజ్ అవుతోన్న డౌట్. ఇప్ప‌టికే ఆయ‌న ప్ర‌తిభ‌ని మెచ్చి బాలీవుడ్ నటులే దిగొచ్చారు. మొన్న‌టి ఆస్కార్ అవార్డుతో స‌న్నివేశం ఒక్క‌ఛాన్స్ ప్లీజ్ అనే వ‌ర‌కూ వ‌చ్చింది. దీంతో బాలీవుడ్ రాజ‌మౌళికి ఛాన్స్ ఇవ్వ‌డం కాదు.. రాజ‌మౌళినే బాలీవుడ్ కి ఛాన్స్ ఇవ్వాలి అన్న‌ది క్లియ‌ర్ గా అర్ధ‌మ‌వుతుంది.

ఈనేప‌థ్యంలో జ‌క్క‌న్న లాంటి లెజెండ్ లో దేశంలో ఉన్న గొప్ప నటులందరితో సినిమాలు చేయాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. అమీర్ ఖాన్.. హృతిక్ రోష‌న్.. అమితాబ‌చ్చ‌న్..చియాన్ విక్ర‌మ్.. క‌మ‌ల్హాస‌న్..ర‌జ‌నీకాంత్..విజ‌య్..సూర్య‌ లాంటి సూప‌ర్ స్టార్ల‌ని డైరెక్ట్ చేస్తే చూడాల‌ని ఆశ‌ప‌డే అభిమానులెంతో మంది.

చ‌ర‌ణ్‌..తార‌క్..ప్ర‌భాస్ ల‌ను ఇప్ప‌టికే డైరెక్ట్ చేసారు. మ‌హేష్ కూడా ఆ జాబితాలో చేరిపోతాడు త్వ‌ర‌లో. బ‌న్నీ లాంటి వారు కూడా రీచ్ అయితే టాలీవుడ్ లో ఓ త‌రం హీరోలు పూర్త‌యిన‌ట్లే. అటుపై జ‌క్క‌న్న ఇత‌ర భాష‌ల హీరోల్ని డైరెక్ట్ చేస్తే మ‌రిన్ని వండ‌ర్స్ కి అవ‌కాశం ఉంద‌ని చెప్పొచ్చు.