Begin typing your search above and press return to search.

ఏఐతో మరో సంచలనం.. లిరికల్ వీడియో గూస్ బంప్సే

అయితే సినీ ఇండస్ట్రీలో కూడా ఏఐ వినియోగం క్రమక్రమంగా పెరుగుతోంది.

By:  Tupaki Desk   |   19 Feb 2024 3:20 AM GMT
ఏఐతో మరో సంచలనం.. లిరికల్ వీడియో గూస్ బంప్సే
X

ప్రస్తుతం ప్రపంచంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడకం బాగా పెరుగుతోంది. ఓపెన్ ఏఐ సంస్థ సృష్టించిన చాట్ జీపీటీతో కొందరు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇలా కూడా వాడొచ్చా అని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల ఓపెన్ ఏఐ.. టెక్ట్స్ టు వీడియో జనరేటర్ సోరాను తీసుకొచ్చింది. అయితే సినీ ఇండస్ట్రీలో కూడా ఏఐ వినియోగం క్రమక్రమంగా పెరుగుతోంది.

ఇటీవల విడుదలైన పలు సినిమాల్లో ఏఐను ఉపయోగించారు సినీ మేకర్స్. గతేడాది నాని హీరోగా నటించిన హాయ్ నాన్నలో ఓ సీన్ కోసం విదేశీ మహిళ వాయిస్ ను ఏఐ ద్వారానే మేకర్స్ క్రియేట్ చేశారు. లాల్ సలామ్ చిత్రంలో కూడా ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెమామాన్ ఇలానే చేశారు. తాజాగా మరో తెలుగు మూవీలో ఏఐ సాయంతో వాయిస్ కాదు ఏకంగా లిరికల్ వీడియోనే సృష్టించారు.

శివ కందుకూరి హీరోగా భూతద్ధం భాస్కర్ నారాయణ మూవీ తెరకెక్కిన మూవీ విషయం తెలిసిందే. యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా.. మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ మూవీ లవర్స్ ను ఆకట్టుకున్నాయి. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాయి.

శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి శివ ట్రాప్ ట్రాన్స్ సాంగ్ ను స్టార్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తాజాగా రిలీజ్ చేశారు. శివుడి నేపథ్యంలో సాగుతున్న ఈ పాటకు చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు. అయితే ఈ లిరికల్ సాంగ్ వీడియోలోని విజువల్స్ ను ఏఐతో జనరేట్ చేశారు మేకర్స్. భారతీయ సినీ ఇండస్ట్రీలో ఫస్ట్ ఏఐ జెనరేటెడ్ లిరికల్ వీడియో సాంగ్ ఇదే కావడం విశేషం

ఈ సాంగ్ కు చైతన్య ప్రసాద్ అందించిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు చెబుతున్నారు. యంగ్ సింగర్ కాలభైరవ ఫుల్ హై ఎనర్జీతో పాడిన ఈ పాట.. ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్తోందని కామెంట్లు పెడుతున్నారు. ఏఐ విజువల్స్ చాలా రిచ్ గా కనిపిస్తున్నాయని అంటున్నారు. మొత్తానికి మేకర్స్ కరెక్ట్ గా కమాండ్స్ ఇవ్వడం వల్ల ఏఐ విజువల్స్ ఫెర్ఫెక్ గా ఉన్నాయని చెబుతున్నారు.