Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఇంకో బాలీవుడ్ మూవీ?

ఇంతలో తారక్ చేయబోయే మరో బాలీవుడ్ మూవీ గురించి వార్తలు హల్‌చల్ చేస్తుండడం విశేషం.

By:  Tupaki Desk   |   5 March 2024 12:30 PM GMT
ఎన్టీఆర్ ఇంకో బాలీవుడ్ మూవీ?
X

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాడు జూనియర్ ఎన్టీఆర్. తన కొత్త చిత్రం ‘దేవర’ సైతం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుండగా.. ఈలోపు అతను నేరుగా హిందీ మూవీ చేయబోతున్నాడు. అదే.. వార్-2. బాలీవుడ్లో స్పై చిత్రాలకు పెట్టింది పేరైన యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది.

ఆల్రెడీ హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘వార్’కు ఇది సీక్వెల్. ‘వార్’ను సిద్దార్థ్ ఆనంద్ రూపొందిస్తే.. ‘వార్-2’ను ‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయబోతున్నాడు. త్వరలోనే తారక్ ఈ సినిమా చిత్రీకరణకు హాజరవుతాడని వార్తలు వస్తున్నాయి. ఇంతలో తారక్ చేయబోయే మరో బాలీవుడ్ మూవీ గురించి వార్తలు హల్‌చల్ చేస్తుండడం విశేషం.

‘వార్-2’ పూర్తయిన తర్వాత యశ్ రాజ్ ఫిలిమ్స్‌లోనే ఇంకో బాలీవుడ్ మూవీ చేసేందుకు తారక్ ఓకే చెప్పాడట. ఇది అతను సోలో హీరోగా నటించే పాన్ ఇండియా మూవీ అని అంటున్నారు. ‘వార్-2’తో వచ్చే గుర్తింపు తర్వాత తారక్ సోలోగా హిందీ మూవీ చేసినా బాగానే వర్కవుట్ అయ్యే అవకాశముంది. మరి ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు అన్నది సస్పెన్స్.

ఇక ‘వార్-2’ విషయానికి వస్తే.. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. హృతిక్ మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. తారక్ త్వరలోనే ‘దేవర’ షూట్ పూర్తి చేసి ఏప్రిల్ నెలాఖర్లో ‘వార్-2’ సెట్లో అడుగు పెడతాడని అంటున్నారు. ‘వార్’లో హృతిక్‌కు తోడుగా టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్ చేశాడు. అతడి పాత్రలో నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. మరి తారక్ కూడా అలాంటి పాత్రే చేస్తాడేమో చూడాలి. తారక్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ ‘జై లవకుశ’లో జనాలు చూశారు. మరోసారి అలాంటి పాత్ర చేస్తే అదిరిపోతుందనడంలో సందేహం లేదు.