Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో సినిమాలో అనఘా కుట్టి..!

తమిళ్‌ స్టార్‌ హీరో సూర్య హీరోగా నటించిన 'రెట్రో' విడుదలకు సిద్ధం అయింది.

By:  Tupaki Desk   |   12 April 2025 12:00 AM IST
స్టార్‌ హీరో సినిమాలో అనఘా కుట్టి..!
X

తమిళ్‌ స్టార్‌ హీరో సూర్య హీరోగా నటించిన 'రెట్రో' విడుదలకు సిద్ధం అయింది. ప్రముఖ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన రెట్రో సినిమాకు పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ అయింది. మే 1న విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ప్రమోషన్‌ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పాటలతో పాటు, టీజర్‌ సినిమాపై ఆసక్తి పెంచాయి. కంగువా సినిమా తర్వాత సూర్య నుంచి వస్తున్న సినిమా ఇదే అనే విషయం తెల్సిందే. కంగువా సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచినా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు కారణం కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందడమే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

రెట్రో సినిమా తర్వాత సూర్య చేస్తున్న సినిమాకు ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు మొదలు అయ్యాయి. రెట్రో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే కచ్చితంగా ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తద్వారా సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న సూర్య 45 సినిమాలో హీరోయిన్‌గా త్రిష నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ విషయమై అధికారికంగా ప్రకటన వచ్చింది.

త్రిషతో పాటు ఈ సినిమాలో మలయాళ సెన్షేషన్‌ బ్యూటీ అనఘా మాయ రవి నటించబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా అనఘా దృవీకరించింది. గత కొన్ని రోజులుగా తమిళ మీడియాలో సూర్య సినిమాలో మలయాళ నటి కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ విషయమై క్లారిటీ వచ్చింది. మలయాళంలో ఈ మధ్య కాలంలో అనఘా మాయ రవి గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. అందంతో పాటు, నటన విషయంలో ఆమె ఎంతో మంది హీరోయిన్స్‌తో పోల్చితే బెస్ట్‌ అంటూ మలయాళ సినీ విశ్లేషకులు, సోషల్‌ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అందుకే అనఘా కి తమిళ్‌లో ఎంట్రీ దక్కింది.

తమిళ్‌ స్టార్‌ హీరో సూర్య సినిమా అది కాకుండా మోస్ట్‌ క్రేజీ ప్రాజెక్ట్‌ అయిన సూర్య 45 లో ఛాన్స్ దక్కించుకోవడం అనేది కచ్చితంగా గొప్ప విషయం అంటూ ఆమె సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్రిష మెయిన్‌ హీరోయిన్‌గా నటించినప్పటికీ కచ్చితంగా అనఘాకి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కే అవకాశాలు ఉన్నాయి అంటూ తమిళ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. అసలు విషయం ఏంటి అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేరళలో మంచి గుర్తింపు ఉన్న ఈ అమ్మడు త్వరలోనే తెలుగు, తమిళ్‌లోనూ బిజీ నటిగా సూర్య 45 సినిమాతో మారే అవకాశాలు ఉన్నాయి.