Begin typing your search above and press return to search.

తెర‌పైకి ఆ లెజెండ‌రీ న‌టి జీవితం!

ఎన్నో హిందీ చిత్రాల్లో న‌టించిన త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు.

By:  Tupaki Desk   |   16 March 2024 4:30 PM GMT
తెర‌పైకి ఆ లెజెండ‌రీ న‌టి జీవితం!
X

వెండి తెర అనార్క‌లి అందం..అభిన‌యంతో మంత్ర‌ముగ్దుల్ని చేసిన బాలీవుడ్ లెజెండ‌రీ న‌టి మ‌ధుబాల‌. ‘ప్యార్ కియా తో డర్నా క్యా.. జబ్ ప్యార్ కియా తో డర్నా క్యా.. అంటూ ప్రేక్ష‌కుల్ని ఉర్రుత‌లూ గించిన ఓ గొప్ప న‌టి. `మొఘల్ ఎ అజం` చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు ద‌క్కించుకున్నారు. అప్ప‌ట్లో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉండేది. దాదాపు రెండు ద‌శాబ్ధాల సినీ ప్ర‌యాణంలో 60 చిత్రాల‌కు పైగా చేసారు. ఎన్నో హిందీ చిత్రాల్లో న‌టించిన త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు.

అప్ప‌టిత‌రం హీరోయిన్ల‌లో ఆమె నెంబ‌ర్ వ‌న్ గా కొన‌సాగారు. అయితే అతి చిన్న వ‌య‌సులోనే క‌న్నుమూ సారు. 1933లో జన్మించిన మధుబాల 36 ఏళ్ల వయసులోనే తుదిశ్వాస విడిచారు. తాజాగా ఇంత కాలానికి ఆమె జీవితాన్ని వెండి తెర‌కు ఎక్కించే ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. మ‌ధుబాల జీవిత విశేషాల ఆధా రంగా జస్మీత్ కె. రీన్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ నిర్మించ‌డానికి ముందుకొచ్చింది.

నిర్మాణంలో మధుబాల సోదరి మధుర్ బ్రిజ్ భూషణ్ కూడా భాగ‌మ‌వుతున్నారు. జ‌స్మీత్ ఇంత‌కు ముందు అలియాభ‌ట్...షాఫాలీ షాతో `డార్లింగ్స్` అనే చిత్రాన్ని తెర‌కెక్కించి స‌క్సెస్ అందుకున్నారు `లెజెండరీ నటి మధుబాల గౌరవార్థం ఆమె జీవితకథను సినిమాగా చేయబోతున్నాం. బాలీవుడ్ ఇండస్ట్రీలోని అత్యంత దిగ్గజ తార కథను వెండితెరపై చూసేందుకు రెడీగా ఉండండి.. ఆమె జీవితం గురించి ఉన్న అపోహలను ఈ సినిమా తొలగిస్తుంది.

సినిమాకు కొంత స్వేచ్ఛ తీసుకున్నప్పటికీ నిజాయితీగానే రూపొందిస్తాం` అని మధుర్ అన్నారు. అయితే మ‌ధుబాల పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రం. ఆ పాత్ర ఎవ‌రు పోషిస్తున్నారు అన్న‌ది మేక‌ర్స్ రివీల్ చేయ‌లేదు. ఆ పాత్ర ఎవ‌రు పోషించినా? ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కుతుంది. అయితే మ‌ధుబాల పాత్ర‌కు అంతే అంద‌మైన న‌టి అవ‌స‌రం. ఆమె అందాన్ని మ్యాచ్ చేసేలా...నేటి జ‌న‌రేష‌న్ లో అంత‌టి ఛ‌రిష్మా ఉన్న హీరోయిన్ అవ‌స‌రం. మ‌రి ఆ ఛాన్స్ బాలీవుడ్ లో ఏ న‌టి అందుకుంటుందో చూడాలి.