Begin typing your search above and press return to search.

తార‌క్ బావ‌.. అస‌లు మ‌ర్చిపోని అల్లు అర్జున్

జూనియ‌ర్ ఎన్టీఆర్. ఈ వ్య‌క్తికి, ఆ పేరుకు ఓ స్పెష‌ల్ ఫాలోయింగే ఉంది. ఎన్టీఆర్ అనే పేరు విన‌బ‌డితే చాలు తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌లంతా రెస్పాండ్ అవుతారు.

By:  Tupaki Desk   |   20 May 2025 6:14 AM
తార‌క్ బావ‌.. అస‌లు మ‌ర్చిపోని అల్లు అర్జున్
X

జూనియ‌ర్ ఎన్టీఆర్. ఈ వ్య‌క్తికి, ఆ పేరుకు ఓ స్పెష‌ల్ ఫాలోయింగే ఉంది. ఎన్టీఆర్ అనే పేరు విన‌బ‌డితే చాలు తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌లంతా రెస్పాండ్ అవుతారు. దేశంలోని న‌లుమూల‌లా ఉన్న అభిమానుల‌కు ఈ పేరు విన‌బ‌డగానే గూస్‌బంప్స్ వ‌స్తాయి. తాత వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఎన్టీఆర్, ఆ త‌ర్వాత హీరోగా మారి ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా త‌న స‌త్తాను చాటుతున్నాడు.

తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డిగా ఇండ‌స్ట్రీలో రాణిస్తున్న ఎన్టీఆర్ బ‌ర్త్ డే ఇవాళ‌. ఎన్టీఆర్ బ‌ర్త్ డే వ‌స్తుందంటే చాలు. ఫ్యాన్స్ కు పండ‌గే. త‌మ అభిమాన హీరో పుట్టిన రోజు సంద‌ర్భంగా అత‌ను న‌టిస్తున్న సినిమాల‌కు సంబంధించిన అప్డేట్స్ వ‌స్తాయ‌ని ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. మే 20న ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అత‌నికి ప‌లువురు సెల‌బ్రిటీలు విషెస్ తెలుపుతున్నారు.

అయితే ఎన్టీఆర్ బ‌ర్త్ డే కు ప్ర‌తీ ఏడాదీ ఎవ‌రి నుంచి విషెస్ వ‌చ్చినా రాక‌పోయినా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి మాత్రం విషెస్ త‌ప్ప‌కుండా వ‌స్తాయి. బ‌న్నీ ఎవ‌రి బ‌ర్త్ డే కు విష్ చేసినా చేయ‌క‌పోయినా తార‌క్ బ‌ర్త్ డే ను మాత్రం గుర్తుపెట్టుకుని మ‌రీ చాలా ఎర్లీగానే ట్వీట్ చేసి విషెస్ చెప్తూ ఉంటాడు. ప్ర‌తీ ఏడాది లానే ఈ ఏడాది కూడా అల్లు అర్జున్, ఎన్టీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తూ ట్వీట్ చేశాడు.

హ్యాపీ బ‌ర్త్ డే బావా.. మీకు విజ‌యం, సంతోషం మ‌రియు ఆనందం ద‌క్కాల‌ని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు బావ అని పిలుచుకుంటుంటార‌నే విష‌యం తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ ఎన్ని ప‌నుల్లో ఉన్నా బావ బ‌ర్త్ డే ను మ‌ర్చిపోకుండా విష్ చేస్తాడ‌ని బ‌న్నీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే, మ‌రోవైపు మెగా ఫ్యాన్స్ మాత్రం చ‌ర‌ణ్ బ‌ర్త్ డే కు మాత్రం ఇవేమీ గుర్తుండ‌వా అంటూ బ‌న్నీ ని ట్యాగ్ చేసి ప్ర‌శ్నిస్తున్నారు.

ఇక సినిమాల విష‌యానికొస్తే ఎన్టీఆర్ న‌టించిన వార్2 ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుపుకుంటుండ‌గా, ప్ర‌శాంత్ నీల్ సినిమా సెట్స్ పై ఉంది. ఎన్టీఆర్‌నీల్ సినిమా వ‌చ్చే ఏడాది జూన్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక అల్లు అర్జున్ విష‌యానికొస్తే, రీసెంట్ గానే బ‌న్నీ పాన్ ఇండియా డైరెక్ట‌ర్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి ఆ సినిమాను అనౌన్స్ చేశాడు. ప్ర‌స్తుతం బ‌న్నీ- అట్లీ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయి.