Begin typing your search above and press return to search.

యంగ్ టైగ‌ర్ స‌ర‌స‌న 'వార్ 2'లో?

ఆర్.ఆర్.ఆర్ లో చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించిన ఆలియా, ఆ సినిమా సెట్స్ లో ఉండ‌గానే ఎన్టీఆర్ తోను ఎంతో స‌న్నిహితంగా క‌లిసిపోయి క‌నిపించింది.

By:  Tupaki Desk   |   12 Feb 2024 5:25 AM GMT
యంగ్ టైగ‌ర్ స‌ర‌స‌న వార్ 2లో?
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న బాలీవుడ్ యువ‌క‌థానాయిక జాన్వీ క‌పూర్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న 'దేవ‌ర'లో జాన్వీ జాక్ పాట్ అందుకుంది. డెబ్యూగా జాన్వీకి ఇది గొప్ప అవ‌కాశం. ఇంత‌లోనే ఆర్.ఆర్.ఆర్ స‌హ‌న‌టి ఆలియా భ‌ట్ ఇప్పుడు ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించ‌నుందని క‌థ‌నాలొస్తున్నాయి. హృతిక్ తో క‌లిసి వార్ 2లో ఎన్టీఆర్ న‌టిస్తున్నార‌ని అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డిన‌ప్ప‌టి నుంచి దీనిపై ఊహాగానాలున్నాయి. 'వార్ 2'లో ఆలియా ఒక‌ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. కానీ హృతిక్ స‌ర‌స‌నా? లేక ఎన్టీఆర్ తో న‌టిస్తుందా? అన్న‌దానిపై స్ప‌ష్ఠ‌త లేదు. అయితే ఆలియా లాంటి ట్యాలెంటెడ్ న‌టి ఎన్టీఆర్ కి సూట‌బుల్ అని అభిమానుల్లో ఒక సెక్ష‌న్ వాదిస్తోంది.

ఆర్.ఆర్.ఆర్ లో చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించిన ఆలియా, ఆ సినిమా సెట్స్ లో ఉండ‌గానే ఎన్టీఆర్ తోను ఎంతో స‌న్నిహితంగా క‌లిసిపోయి క‌నిపించింది. చ‌ర‌ణ్‌, తారక్ ల‌ ప్ర‌తిభ‌కు ఆశ్చ‌ర్య‌పోయాన‌ని ఆలియా కాంప్లిమెంట్ ఇచ్చింది. అప్ప‌ట్లోనే ఎన్టీఆర్ న‌టించే త‌దుప‌రి చిత్రం దేవ‌ర కోసం ఆలియాను ఒప్పించే ప‌నిలో ఉన్నార‌ని ప్ర‌చార‌మైంది. అయితే అది అప్ప‌ట్లో సాధ్య‌ప‌డ‌లేదు. దాంతో జాన్వీ క‌పూర్ ని కొర‌టాల ఒప్పించారు. ఇప్పుడు వార్ 2 కోసం ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించేందుకు ఆలియా అంగీక‌రించింద‌ని గుసగుస‌లు వినిపిస్తున్నాయి. అయితే దేనికీ అధికారిక క‌న్ఫ‌ర్మేష‌న్ రాలేదు. వార్ 2 ఈ నెలాఖ‌రు నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్న నేప‌థ్యంలో అయాన్ ముఖ‌ర్జీ క‌థానాయిక‌ల‌ను ఫైన‌ల్ చేసే ప‌నిలో ఉన్నార‌ని తెలిసింది.

ఆలియా ది గ్రేట్:

రాజీ, గంగూభాయి కతియావాడీ, గ‌ల్లీ బోయ్ స‌హా ఎన్నో చిత్రాల్లో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ఆలియా భ‌ట్ నేటిత‌రంలో అత్యుత్త‌మ పెర్ఫామ‌ర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవ‌లే కృతిసనోన్ తో క‌లిసి జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డును కూడా ఆలియా షేర్ చేసుకుంది. చిన్న వ‌య‌సులోనే జాతీయ ఉత్త‌మ న‌టిగా నిరూపించింది. అంతేకాదు.. ఇటీవ‌ల‌ హలీవుడ్ లోను న‌టించింది. అందుకే ఆలియా లాంటి క్రేజీ స్టార్ చేరిక‌తో ఆ ప్రాజెక్ట్ విలువ అమాంతం పెరుగుతుంది. హృతిక్, ఎన్టీఆర్ ఇప్ప‌టికే పాన్ ఇండియా స్టార్లు. అందువ‌ల్ల ఈ క‌ల‌యిక‌లో రూపొందే చిత్రానికి ఆలియా అద‌న‌పు బ‌లంగా మారుతుంది. 'వార్ 2' ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న ఇండ‌స్ట్రీ రికార్డుల‌న్నిటీనీ బ్రేక్ చేసేందుకు ఆస్కారం ఉంద‌ని అంచ‌నా. ఈ చిత్రానికి 'బ్ర‌హ్మాస్త్ర' ఫేం అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. య‌ష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తోంది.