సెక్రటరీ చేతిలో మోసపోయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్
ప్రముఖ బాలీవుడ్ నటి మాజీ సెక్రటరీ వేదికా శెట్టిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ బిల్లులను తయారు చేసినందుకు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By: Tupaki Desk | 9 July 2025 12:54 PM ISTప్రముఖ బాలీవుడ్ నటి మాజీ సెక్రటరీ వేదికా శెట్టిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ బిల్లులను తయారు చేసినందుకు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మే 2022 నుంచి ఆగస్ట్ 2024 మధ్య వేదికా శెట్టి రూ.76 లక్షలు విలువ గల నకిలీ బిల్స్ ను తయారు చేసి, ఆ బిల్స్ పై ఆలియా భట్ సంతకాలు తీసుకుని వాటిని తన క్లోజ్ ఫ్రెండ్స్ అకౌంట్స్ లోకి ట్రాన్స్‌ఫర్ చేశారు వేదికా శెట్టి.
ఈ రేండేళ్లలో వేదికా శెట్టి అక్షరాలా రూ.76 లక్షలను దుర్వినియోగం చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఈ విషయంపై ఆలియా భట్ టీమ్ ఈ ఏడాది మొదట్లో కేసు నమోదు చేయగా, కేసు ఫిర్యాదైన తర్వాత నుంచి గత కొన్ని నెలలుగా ఆమె పరారీలో ఉన్నారు. మొత్తానికి పోలీసులు 5 నెలల పాటూ వెతికి వేదికా శెట్టిని బెంగుళూరులో అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరు పరిచారు.
కోర్టులో హాజరుపరిచాక అటు పిమ్మట వేదికా శెట్టి పోలీసులు జులై 10 వరకు కస్టడీకి తరలించారు. ప్రస్తుతం ఈ విషయంలో దర్యాప్తు కొనసాగుతంది. వేదికతో పాటూ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ఇతర వ్యక్తులపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వేదికా శెట్టి చేసిన మోసం బయటికొచ్చాక ఆలియా తల్లి సోనీ రజ్దాన్ పోలీసులకు కంప్లైంట్ చేశారు.
ఆలియా భట్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఆమె ఆల్ఫా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ 25, 2025న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ఆలియాతో పాటూ శార్వరి వాఘ్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇది కాకుండా లవ్ వార్ మూవీలో కూడా ఆలియా నటిస్తున్నారు. వీటితో పాటూ మరికొన్ని సినిమాల కోసం కథలు వింటూ ఆలియా బిజీగా ఉన్నారు.
