మూవీ లవర్స్‌కు ఫుల్ ఫీస్ట్.. జూలై-ఆగస్టులో టాలీవుడ్ బంపర్ రిలీజ్‌లు!
ఈ ఏడాది ఫస్టాఫ్ కొంచెం స్లోగా సాగినప్పటికీ, రాబోయే రెండు నెలలు మాత్రం సినిమా లవర్స్‌కు పండగే అని చెప్పాలి.
By: Madhu Reddy | 9 July 2026 1:47 PM ISTఈ ఏడాది ఫస్టాఫ్ కొంచెం స్లోగా సాగినప్పటికీ, రాబోయే రెండు నెలలు మాత్రం సినిమా లవర్స్‌కు పండగే అని చెప్పాలి. జూలై 10 నుంచి ఆగస్టు చివరి వరకు థియేటర్లలో సినిమాల జాతర జరగబోతోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, హాలీవుడ్ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయ్యాయి. రాబోయే ఏడు వారాల పాటు ప్రేక్షకులకు ఊపిరి సలపని వినోదాన్ని పంచేందుకు ఇండస్ట్రీ సిద్ధమైంది. ఆ విశేషాలు చూద్దాం..
జూలై ఫస్ట్ హాఫ్‌లో క్రేజీ రిలీజ్‌లు:
ఈ యాక్షన్ హంగామా జూలై 9న మలయాళ సినిమా 'నోబడీ'తో ప్రారంభం కానుంది. ఆ మరుసటి రోజే అంటే జూలై 10న అఖిల్ అక్కినేని మోస్ట్ అవేటెడ్ మూవీ 'లెనిన్' థియేటర్లలోకి రాబోతోంది. అఖిల్ కమ్‌బ్యాక్ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక జూలై 17న ఒకేసారి మూడు సినిమాలు.. 'ఓ.. సుకుమారి', 'రాజా ది రాజా', 'ది ఒడిస్సీ' ఒకే రోజు పోటీ పడుతూ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.
జూలై చివరలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు:
జూలై 23న 'జననాయగన్' సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది, అయితే సెన్సార్ పనులు పూర్తయ్యాక దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇక జూలై 24న కిరణ్ అబ్బవరం నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' రిలీజ్ కానుంది. జూలై 30న అజయ్ భూపతి దర్శకత్వంలో ఘట్టమనేని జయకృష్ణ ఎంట్రీ ఇస్తున్న 'శ్రీనివాస మంగాపురం'తో పాటు, తమిళ చిత్రాలు 'డిసి', 'సిగ్మా' కూడా రానున్నాయి. ఇక అదే రోజు హాలీవుడ్ పెద్ద సినిమా 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' కూడా విడుదల కాబోతోంది.
ఆగస్టు ఫస్ట్ హాఫ్‌లో స్టార్ హీరోల సందడి:
ఆగస్టు నెల కూడా అదిరిపోయే సినిమాలతో స్టార్ట్ కానుంది. ఆగస్టు 7న వరుణ్ తేజ్ నటిస్తున్న 'కొరియన్ కనకరాజు' థియేటర్లలోకి రానుంది. ఆ తర్వాత ఆగస్టు 14న సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' మరియు హిందీ మూవీ 'ఆవారపన్ 2' విడుదల కానున్నాయి. ఇక ఆగస్టు 21న మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' థియేటర్లలో రచ్చ చేయడానికి సిద్ధంగా ఉంది.
బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ లైనప్:
ఆగస్టు నెలాఖరున ఈ సీజన్ లోనే అత్యంత భారీ చిత్రం విడుదల కాబోతోంది. కేజీఎఫ్ స్టార్ యష్ నటించిన పాన్-ఇండియా మూవీ 'టాక్సిక్' ఆగస్టు 26న భారీ బడ్జెట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఇక ఈ సుదీర్ఘ సినీ జాతర ఆగస్టు 28న 'వీసా' అనే సినిమాతో ముగియనుంది.
మొత్తానికి జూలై, ఆగస్టు నెలలు సినిమా ప్రియులకు కనువిందు చేయనున్నాయి. చిన్న సినిమాల నుంచి పాన్-ఇండియా పెద్ద సినిమాల వరకు అన్ని రకాల జోనర్లు లైన్ లో ఉన్నాయి. మరి ఈ భారీ రేసులో ఏయే సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, ప్రేక్షకులను మెప్పిస్తాయో చూడాలి. ఇక మీరైతే ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో ప్లాన్ చేసుకోండి..
