'లెనిన్'- అఖిల్ ఎలివేషన్స్ కోసం గట్టిగానే..
తిరుమల కొండల నేపథ్యంలో సాగే ఈ సీక్వెన్స్ సినిమాలో హైలైట్‌గా నిలవనుందని టాక్.
By: Tupaki Desk | 25 May 2025 11:34 AM ISTఅక్కినేని అఖిల్ ఏజెంట్ అనంతరం కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఈసారి ఎలాగైనా మాస్ ప్లస్ ఏమోషన్ మిక్స్ చేసిన కథతో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలని చూస్తున్నాడు. ఇక అతను నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్‌లో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో చిత్తూరు ప్రాంతంలో సాగుతుంది.
శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ యాక్షన్ లవ్ డ్రామా ఇప్పటికే టైటిల్ గ్లింప్స్‌తో అభిమానులను ఆకర్షించింది. అఖిల్ చిత్తూరు యాసలో మాట్లాడుతూ, కొత్త లుక్‌లో కనిపించనున్న ఈ సినిమా దసరా సందర్భంగా విడుదల కానుందని సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ‘లెనిన్’ సినిమాలో అఖిల్ ఎంట్రీ సీక్వెన్స్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమాలో తిరుమల తిరుపతి బ్యాక్ డ్రాప్ కూడా హైలెట్ కానున్నట్లు సమాచారం. ఇక ఆ ప్రాంతంకు తగ్గట్లే భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. తిరుమల కొండల నేపథ్యంలో సాగే ఈ సీక్వెన్స్ సినిమాలో హైలైట్‌గా నిలవనుందని టాక్. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సెట్‌ను రూపొందిస్తున్నారు, ఈ సీన్‌లో నేటివిటీని అద్భుతంగా డిజైన్ చేశారట.
ఈ సీక్వెన్స్ తర్వాత వెంటనే ఒక యాక్షన్ ఎపిసోడ్‌ను కూడా చిత్రీకరించనున్నారు, దీని కోసం మరో సెట్ సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడుతున్నాడని, ఈ ఎంట్రీ సీక్వెన్స్ అభిమానులకు ఓ విజువల్ ట్రీట్‌గా నిలుస్తుందని టీమ్ అంటోంది. గతంలో ‘ఏజెంట్’ సినిమా ఫ్లాప్ తర్వాత అఖిల్ ఈ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టాడు. చిత్తూరు యాసలో మాట్లాడటం కోసం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.
అఖిల్‌తో పాటు శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చే లవ్ సీన్స్ కూడా సినిమాలో ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. ‘లెనిన్’ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, నవీన్ కుమార్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్షన్ అందిస్తున్నారు. “ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన టైటిల్ గ్లింప్స్ అఖిల్‌ను కృష్ణుడి స్ఫూర్తితో చూపిస్తూ అందరినీ ఆకర్షించింది. అఖిల్ కెరీర్‌లో ఈ సినిమా కీలకమైన మలుపుగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి లెనిన్ ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.
