Begin typing your search above and press return to search.

అఖిల్ పెళ్లి రిసెప్ష‌న్‌లో సినీరాజ‌కీయ ప్ర‌ముఖులు

నాగార్జున కుమారుడు అఖిల్ అక్కినేని పారిశ్రామికవేత్త జుల్ఫీ రావ్‌జీ కుమార్తె జైనాబ్ రావూజీని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆదివారం సాయంత్రం భారీ విందు కార్య‌క్ర‌మంలో ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాలు సంద‌డి చేసారు.

By:  Tupaki Desk   |   9 Jun 2025 9:53 AM IST
అఖిల్ పెళ్లి రిసెప్ష‌న్‌లో సినీరాజ‌కీయ ప్ర‌ముఖులు
X

నాగార్జున కుమారుడు అఖిల్ అక్కినేని పారిశ్రామికవేత్త జుల్ఫీ రావ్‌జీ కుమార్తె జైనాబ్ రావూజీని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆదివారం సాయంత్రం భారీ విందు కార్య‌క్ర‌మంలో ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాలు సంద‌డి చేసారు. ఈ వేడుకలో దక్షిణ భారత చ‌ల‌న‌చిత్ర పరిశ్రమ ప్ర‌ముఖులంతా క‌నిపించారు. మహేష్ బాబు, రామ్ చరణ్, సూర్య, నాని, కేజీఎఫ్ య‌ష్‌, అడివి శేష్, నిఖిల్ స‌హా పలువురు సౌత్ స్టార్లు అఖిల్ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు.

విందులో కొత్త పెళ్లి కొడుకు అఖిల్ న‌వ‌ వధువు జైనాబ్‌తో చేయి చేయి కలిపి క‌నిపించాడు. కొత్త జంట‌ అతిథుల‌తో మాట్లాడుతూ క‌నిపించారు. తెల్లటి టక్సేడోలో నల్లటి బౌటీ ధ‌రించి అఖిల్ స్మార్ట్ గా కనిపించాగా, జైనాబ్ పాస్టెల్ పింక్ క‌ల‌ర్ డిజైన‌ర్ లెహంగాలో ఖ‌రీదైన‌ వజ్రాల ఆభరణాలతో అద్భుతంగా కనిపించింది.

అతిథుల జాబితాలో మ‌హేష్‌- న‌మ్ర‌త ఫ్యామిలీతో పాటు, రామ్ చరణ్ - ఉపాసన, నిఖిల్- ప‌ల్ల‌వి వ‌ర్మ‌ దంప‌తులు ఉన్నారు. కేజీఎఫ్ స్టార్ యష్ ఆలివ్ గ్రీన్ షేర్వానీ, తలపాగా ధరించి వధూవరులతో ఉల్లాసంగా పోజులిచ్చాడు. ఈ రిసెప్షన్‌లో త‌మిళ స్టార్ హీరో సూర్య, నేచుర‌ల్ స్టార్ నాని, అడివి శేష్‌, కిచ్చా సుదీప్ తదితరులు పాల్గొన్నారు. సినీనిర్మాతల్లో అశ్వినిదత్, దిల్ రాజు, కెఎల్ నారాయ‌ణ‌, అల్లుఅరవింద్, కె ర‌ఘురామ‌రాజు, ప్ర‌సాద్ వి పొట్లూరి, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు అటెండ‌య్యారు.

అలాగే రాజ‌కీయ నాయ‌కుల్లో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, భాజ‌పా నాయ‌కుడు, మాజీ రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, తేదేపా ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు. అలాగే అక్కినేని కుటుంబ స‌భ్యులంతా ఈ వేదిక వ‌ద్ద సంద‌డిగా క‌నిపించారు. నాగ చైతన్య- శోభితా ధూళిపాల జంట కూడా ప్ర‌త్యేకంగా క‌నిపించారు. నాగార్జున- అమ‌ల దంప‌తులు, సుశాంత్, సుమంత్ ఇతర అక్కినేని కుటుంబ సభ్యులు అఖిల్ అక్కినేని-జైనాబ్ వివాహ రిసెప్షన్‌లో స‌కుటుంబ స‌మేతంగా పోజులిచ్చారు.