అఖిల్ లెనిన్ అసలు సూత్రధారి ఆయనేనా..?
లెనిన్ సినిమా కర్త కర్మ క్రియ అంతా కూడా నాగార్జునే అని తెలుస్తుంది. నాగార్జున సీనియారిటీ కచ్చితంగా అఖిల్ కు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.
By: Tupaki Desk | 13 April 2025 12:00 AM ISTఅక్కినేని యువ హీరో అఖిల్ తన నెక్స్ట్ సినిమా రీసెంట్ గా అనౌన్స్ చేశాడు. అఖిల్ 6వ సినిమాగా లెనిన్ అంటూ రాబోతున్నాడు. ఈ సినిమాను మురళి కిశోర్ డైరెక్ట్ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నారు. అఖిల్ లెనిన్ విషయంలో సినిమా అప్పుడో ఓకే అయినా ఫస్ట్ లుక్ టీజర్ దాకా చాలా సీక్రెట్ గా ఉంచారు. లెనిన్ తో అఖిల్ సరికొత్త మాస్ అవతార్ తో రాబోతున్నాడు. తప్పకుండా సినిమా సంథింగ్ స్పెషల్ ఉంటుంది అనిపించేలా టీజర్ ఉంది.
ముఖ్యంగా అఖిల్ లుక్ టీజర్ కాన్సెప్ట్ అక్కినేని ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ కి ఎక్కేశాయి. అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో అఖిల్ మాస్ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. ఐతే అఖిల్ లెనిన్ సినిమా విషయంలో అసలు సూత్రధారి మన కింగ్ నాగార్జున అని తెలుస్తుంది. అఖిల్ ఏజెంట్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో చాలా లో ఫీల్ అయ్యాడు. యూఎస్ వెళ్లి అక్కడ కాస్త రిలాక్స్ అయ్యాడు అఖిల్.
ఇక నెక్స్ట్ సినిమాపై రకరకాల ఊహాగానాలు ఉండగా ఈసారి అఖిల్ సినిమా బాధ్యతను నాగార్జున పూర్తిగా మీద వేసుకున్నారు. కథ వినడం కాంబినేషన్ సెట్ చేయడం ఇలా అన్నిటినీ దగ్గర ఉండి చూసుకున్నారు. మురళి కిశోర్ చెప్పిన కథ లాక్ చేయడమే కాదు సినిమా ఎలా తీయాలన్నది కూడా కంప్లీట్ ఐడియా వచ్చాకే ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. సైలెంట్ గా షూటింగ్ మొదలు పెట్టి టీజర్ తోనే సినిమా ప్రకటించారు.
లెనిన్ సినిమా కర్త కర్మ క్రియ అంతా కూడా నాగార్జునే అని తెలుస్తుంది. నాగార్జున సీనియారిటీ కచ్చితంగా అఖిల్ కు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా అఖిల్ కెరీర్ ని గాడిలో పడేలా చేసే ప్రయత్నంలో నాగ్ తన సొంత సినిమాలను కూడా లేట్ చేస్తున్నాడు. సో లెనిన్ విషయంలో నాగార్జున ప్లానింగ్ ప్రకారమే అంతా జరుగుతుందని తెలుస్తుంది. మరి లెనిన్ తో అయినా అఖిల్ కమర్షియల్ సక్సెస్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.
అఖిల్ 6వ సినిమాతో పాటు యువి క్రియేషన్స్, హోంబలె బ్యానర్ లో కూడా ఒక భారీ ప్రాజెక్ట్ ఉంటుందని టాక్. ఐతే లెనిన్ పూర్తయ్యాకే ఆ సినిమా ఉంటుందని తెలుస్తుంది. లెనిన్ సినిమా టీజర్ అక్కినేని ఫ్యాన్స్ కి ఫుల్ హై ఇచ్చింది. మరి సినిమా ఏం చేస్తుందో చూడాలి.
