అఖిల్ 'లెనిన్'.. పెద్ద ప్లానే ఇది..
మొదట జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన లెనిన్ మూవీ.. రీసెంట్ గా జూలై 10వ తేదీకి వాయిదా పడింది.
By: M Prashanth | 16 Jun 2026 12:17 PM ISTఅఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ లెనిన్. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఆ సినిమా రిలీజ్ డేట్ మరోసారి మారడంతో అభిమానుల్లో నిరాశ నెలకొన్నప్పటికీ, మూవీ టీమ్ చేస్తున్న కొత్త ప్రయత్నాలు మాత్రం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా ఓ సీనియర్ స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
మొదట జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన లెనిన్ మూవీ.. రీసెంట్ గా జూలై 10వ తేదీకి వాయిదా పడింది. ఆ విషయాన్ని నిర్మాత నాగార్జున స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. విడుదల ఆలస్యంపై వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ, ప్రేక్షకులకు బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించడమే ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణమని స్పష్టం చేశారు.
"ప్రేక్షకులకు 100 % పర్ఫెక్ట్ అవుట్ పుట్ ఇవ్వాలనేది మా టార్గెట్. అందుకోసం మూవీ టీమ్ మరికొంత సమయం కోరింది. వాళ్ల పట్టుదల చూసి నేను కూడా అంగీకరించా. ఆ సినిమాతో ప్రేక్షకులు సరికొత్త అఖిల్ ను చూస్తారు" అంటూ నాగార్జున ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆ మూవీ పోస్ట్ పోన్ వెనుక టెక్నికల్ రీజన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో మేకర్స్ పెద్ద ప్లాన్ హాట్ టాపిక్ గా మారింది.
ఓ సీనియర్ స్టార్ హీరో లెనిన్ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించనున్నట్లు తెలుస్తోంది. కథను ముందుకు తీసుకెళ్లే కీలక సీన్స్ లో ఆ వాయిస్ వినిపిస్తుందా? లేక ఇంట్రో సీన్ కు పరిమితం అవుతుందా? అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, స్టార్ హీరో వాయిస్ యాడ్ కావడం వల్ల సినిమాకు మరింత వెయిట్ పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే అఖిల్ రగ్గడ్ మాస్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కొత్త ప్రచారం సినిమాపై అంచనాలను మరో రేంజ్ కు తీసుకెళ్తోంది. దీంతో లెనిన్ కోసం మేకర్స్ నిజంగా పెద్ద ప్లాన్ అమలు చేస్తున్నారనే చర్చ నెటిజన్లలో మొదలైంది. అయితే ఆ ప్లాన్ ఇప్పుడు ఎంతవరకు సక్సెస్ అవుతుందన్న విషయం కూడా ఆసక్తికరంగా మారింది.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లోని రొమాంటిక్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న లెనిన్ చిత్రానికి వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తుండగా, సీనియర్ నటుడు శివాజీ, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై నాగవంశీ, నాగార్జున నిర్మిస్తున్న ఆ చిత్రం అఖిల్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అనే చెప్పాలి. అయితే వరుస వాయిదాలతో కొందరు ఫ్యాన్స్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ.. నాగార్జున ఇచ్చిన హామీ, కొత్తగా వినిపిస్తున్న స్టార్ వాయిస్ ప్రచారం ఫ్యాన్స్ లో మళ్లీ జోష్ నింపుతున్నాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు జూలై 10పైనే ఉంది. మరి ఆ భారీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
