Begin typing your search above and press return to search.

సినిమా వాళ్ల‌ను AIలో ఆడుకుంటున్నారు

కృత్రిమ మేధ (AI) చాలా స‌ర్ ప్రైజ్‌ల‌కు తెర తీస్తోంది. ఏఐతో అంత‌ర్జాల‌లో చాలా క్రియేటివిటీని ప్ర‌ద‌ర్శిస్తున్నారు యువ‌త‌రం. ఏఐలో సృష్టించిన అంద‌మైన యాంక‌ర్లు వార్త‌లు చ‌దువుతుంటే ఆశ్చ‌ర్య‌పోవ‌డం మ‌నిషి వంతు అయింది.

By:  Tupaki Desk   |   1 Jun 2025 9:00 PM IST
సినిమా వాళ్ల‌ను AIలో ఆడుకుంటున్నారు
X

కృత్రిమ మేధ (AI) చాలా స‌ర్ ప్రైజ్‌ల‌కు తెర తీస్తోంది. ఏఐతో అంత‌ర్జాల‌లో చాలా క్రియేటివిటీని ప్ర‌ద‌ర్శిస్తున్నారు యువ‌త‌రం. ఏఐలో సృష్టించిన అంద‌మైన యాంక‌ర్లు వార్త‌లు చ‌దువుతుంటే ఆశ్చ‌ర్య‌పోవ‌డం మ‌నిషి వంతు అయింది. నిజానికి జీవం ఉన్న‌ మాన‌వ యాంక‌ర్ కంటే ఏఐలో రూపొందించిన కృత్రిమ‌ యాంక‌ర్ ఇంకా అందమైన హావ‌భావాలు ప‌లికించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఈ సాంకేతిక‌త ఆ విభాగానికే ప‌రిమితం కాలేదు. ఏఐ లో జంతువుల‌ను య‌థాత‌థంగా సృష్టిస్తున్నారు. వాటి క‌ద‌లిక‌ల‌తో వీడియోలు ఆశ్చ‌ర్య‌పరుస్తున్నాయి. అలాగే బేబి ఫోటోల‌ను విజువ‌ల్స్ ని జీవంతో సృష్టించ‌డ‌మే గాక‌, వాటి క‌ద‌లిక‌ల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఇప్ప‌టికే ఏఐ, చాట్ జీపీటీ వంటి సాంకేతిక‌త‌ల వినియోగం ఇండ‌స్ట్రీలో పెరుగుతోంది. AI సాంకేతికతను ఉపయోగించి మీమ్స్, వినోదాత్మక వీడియోలను తయారు చేస్తూ సృజ‌నాత్మ‌క‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు చాలా మంది.

అయితే ఏఐ బేబీల‌తో టాలీవుడ్ స్టార్ల‌ను రీప్లేస్ చేస్తూ కొన్ని తెలుగు సినిమాల‌లో దృశ్య‌లు, డైలాగుల్ని పునఃసృష్టించిన తీరు ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. మహేష్ `ఖలేజా` నుంచి క్లిప్‌ను ఈ సాంకేతికతను ఉపయోగించి బేబీలతో రీక్రియేట్ చేసారు. త‌రువాత కింగ్ నుండి బ్రహ్మానందం కామెడీ సన్నివేశాన్ని కూడా బేబీ పాత్రతో రూపొందించారు. `సరిలేరు నీకెవ్వరు` ఆడియో లాంచ్ కార్యక్రమంలో విజయశాంతితో మెగాస్టార్ చిరంజీవి చేసిన వైరల్ ప్రసంగాన్ని కూడా ఏఐ ఉపయోగించి బేబీ పాత్రలతో రూపొందించారు. ప్ర‌స్తుతం ఈ వీడియోలు ఇంటర్నెట్‌లో వైర‌ల్‌గా మారుతున్నాయి.

ఇవి మాత్ర‌మే కాదు.. ఇటీవ‌ల చావా లాంటి రాజుల క‌థ‌ల్ని సినిమాలుగా తీసిన‌ప్పుడు ఫ‌లానా చ‌క్ర‌వ‌ర్తి పాత్ర‌లో ఫ‌లానా తెలుగు స్టార్ అయితే ఇలా ఉంటాడు!అంటూ ఫోటోలు, వీడియోల‌ను క్రియేట్ చేసి ప్ర‌ద‌ర్శిస్తున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. చ‌రిత్ర‌కారుల క‌థ‌ల్లోకి వెళితే నాటి చ‌రిత్ర‌కారుల రూపాల్లో ర‌జ‌నీకాంత్ అయితే ఇలా ఉంటారు అని, లేదా ప్ర‌భాస్ అయితే ఇలా క‌నిపిస్తాడు! అంటూ ఊహాచిత్రాల‌ను కూడా ప్ర‌ద‌ర‌శిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. మ్యాన్యువ‌ల్ గా ఒక డిజైన‌ర్ ఇలాంటివి రూపొందించాలంటే రోజుల త‌ర‌బ‌డి ఫోటోషాప్ ల‌లో శ్ర‌మించాల్సి ఉంటుంది. కానీ ఏఐ సాంకేతిక‌త‌ను ఉప‌యోగించి వీటిని చాలా సులువుగా త‌యారు చేస్తున్నారు. ఏఐ భ‌విష్య‌త్ ని శాసించే దిశ‌గా అభివృద్ధి చెందుతోంది. ఉద్యోగాలు త‌గ్గిస్తోంది. భ‌విష్య‌త్ లో ఆర్టిస్టులు లేకుండా ఏఐతోనే సినిమాలు తీసేస్తారేమో! ఆర్టిఫిషియ‌ల్ బొమ్మ‌లు ప్రాణం ఉన్న మ‌నుషులుగా ప్ర‌వ‌ర్తిస్తే, ఏది బొమ్మ? ఏది మ‌నిషి అన్న‌ది అర్థం కాని గంద‌ర‌గోళం త‌లెత్తితే ఎలా ఉంటుందో ఊహించండి.