Begin typing your search above and press return to search.

సైయారా, కూలీ, వార్-2.. AIదే కీలక పాత్ర!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అన్ని రంగాలకు విస్తరించిన ఏఐ.. ప్రభావితం కూడా చేస్తోంది. ఎంతటి విప్లవాన్ని తీసుకువచ్చిందో మనం చూస్తూనే ఉన్నాం.

By:  M Prashanth   |   16 Aug 2025 3:29 PM IST
సైయారా, కూలీ, వార్-2.. AIదే కీలక పాత్ర!
X

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అన్ని రంగాలకు విస్తరించిన ఏఐ.. ప్రభావితం కూడా చేస్తోంది. ఎంతటి విప్లవాన్ని తీసుకువచ్చిందో మనం చూస్తూనే ఉన్నాం. మనిషి చేసే పనులు, చేయని పనులను కూడా శరవేగంగా చేసి పెడుతోంది. పెను మార్పులకు శ్రీకారం చుడుతోంది.

ఆ ఇండస్ట్రీ.. ఈ ఇండస్ట్రీ అని కాదు.. ఒకటేమిటీ అన్ని రంగాల్లో వేగంగా దూసుకుపోతోంది. వ్యాపార రంగంలో ఇప్పటికే ఏఐను విపరీతంగా వినియోగిస్తుండగా.. ప్రస్తుతం సినీ రంగంలో కూడా వాడకం పెరిగిపోతోంది. మేకర్స్.. ఏఐను ఉపయోగించి అనేక పనులు కంప్లీట్ చేస్తున్నారు. రీసెంట్ గా అనేక సినిమాల విషయంలో అదే జరిగింది.

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైయారా, కూలీ, వార్-2 చిత్రాల్లో ఏఐ కీలక పాత్ర పోషించినట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానితో మేకర్స్ భారీ వర్క్స్ ను ఈజీగా కంప్లీట్ చేశారని టాక్ వినిపిస్తోంది. సరైన రిజల్ట్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఆయా చిత్రాల మేకర్స్ అందుకున్నారని సమచారం.

ముందుగా సైయారా విషయానికొస్తే.. చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. మూవీ ఆద్యంతం మెప్పించింది. ఇప్పుడు ఆ మూవీ క్లైమాక్స్ స్క్రిప్ట్ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయ సహాకారాలను మేకర్స్ తీసుకున్నారట.

ఆ తర్వాత కూలీ సినిమాకు గాను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్ ఏఐను ఉపయోగించినట్లు ఇప్పటికే ప్రమోషన్స్ లో తెలిపారు. కూలీ సౌండ్ ట్రాక్ పై వర్క్ చేస్తున్నప్పుడు ఏఐను ఉపయోగించి క్రియేటివ్ బ్లాక్ దాటానని చెప్పారు. ఇప్పుడు రజినీకాంత్ డీఏజింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను యాజ్ చేశారని సమాచారం.

ఇక వార్-2 సినిమా మేకర్స్ కూడా ఏఐను వినియోగించినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్టార్టప్ ద్వారా సినిమాను ఏకంగా తెలుగులోకి డబ్ చేశారని సమాచారం. విజువల్ డబ్ అనే టూల్ ను ఉపయోగించినట్లు వినికిడి. తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో ఆడియోకు లింప్ సింక్ కు ఎలాంటి డిఫరెన్స్ లేకుండా ఆ టూల్ చూసుకున్నట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. మరి ఫ్యూచర్ లో ఇంకెన్ని సినిమాల మేకర్స్ యూజ్ చేస్తారో చూడాలి.