Begin typing your search above and press return to search.

ఏఐతో ఫిల్మ్ మేకింగ్.. కానీ ఆ ఛాలెంజ్ తప్పదు!

ఏఐ టెక్నాలజీ, జనరేటెడ్ వాయిస్‌లతో స్టిన్నింగ్ విజువల్స్ క్రియేట్ చేయవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డీప్ ఫేక్లు ఇలాంటివే.

By:  Tupaki Desk   |   15 July 2025 12:04 PM IST
ఏఐతో ఫిల్మ్ మేకింగ్.. కానీ ఆ ఛాలెంజ్ తప్పదు!
X

ట్రెండ్ మారుతున్నా కొద్దీ సినిమాలు తీసే విధానం కూడా మారుతుంది. గతకొన్నేళ్లలో సినిమాలు తీసే విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సీజీ ఎఫెక్ట్స్ , గ్రాఫిక్స్ వర్క్స్ వంటివి ఇందులో భాగమే. అయితే ప్రస్తుతం టెక్నాలజీలో అనేక మార్పులు వచ్చాయి. అన్ని విభాగాల్లో కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) వచ్చేసింది. ఇది రానున్న రోజుల్లో సినిమాల్లోనూ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఏఐతో సినిమాలు తీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటికే పలు సినిమాల్లో ఏఐని ఉపయోగించి చనిపోయిన సింగర్స్, ఆర్టిస్ట్ ల వాయిస్ తీసుకొచ్చిన సందర్భాలు చూశాం. కానీ, పూర్తిగా ఈ టెక్నాలజీపైనే ఆధారపడి సినిమా అయితే రాలేదు. అయితే ఫ్యూచర్ లో మాత్రం కచ్చితంగా వచ్చే అవకాశం ఉంది.

కృత్రిమ మేధస్సు భవిష్యత్ లో సినిమాలు తీసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉన్న టెక్నాలజీతో పెద్ద పెద్ద సెట్స్ వేయాల్సిన అవసరం లేదు. లొకేషన్స్ కోసం వీదేశాలకు వెళ్లాల్సిన పని లేదు. ఎక్కువ మందిని నియమించుకోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా ఇంట్లోనే కూర్చొని ప్రేక్షకులకు మంచి కంటెంట్ అందించవచ్చు.

ఏఐ టెక్నాలజీ, జనరేటెడ్ వాయిస్‌లతో స్టిన్నింగ్ విజువల్స్ క్రియేట్ చేయవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డీప్ ఫేక్లు ఇలాంటివే. నెట్టింట ఇన్ ఫ్యూయెన్సర్లు ఈ టెక్నాలజీనే వాడి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. కానీ, ఇలాంటి ఏఐతో ముప్పు కూడా ఉంటుంది. అందుకే యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలాంటి ప్లాట్ ఫామ్లు AI- జనరేటెడ్ కంటెంట్‌ పై ఇటీవల ఆంక్షలు కూడా విధించింది.

అయితే ఏఐ వాడకంతో సినిమాలు తీస్తే, బడ్జెట్ పరంగా లాభామే. కానీ, ఇది పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పలేం. సినిమా అనేది హ్యూమన్ ఎమోషన్స్, స్టోరీ టెల్లింగ్ వంటివి ఆడియెన్స్ పై ఇంపాక్ట్ చూపించేలా రూపొందించబడతాయి.

కానీ, ఏఐ వీటన్నింటినీ భర్తీ చేయలేదు. ఇది సినిమాలు తీసే విధానాన్ని మార్చవచ్చు. కానీ, ఒక టెక్నాలజీతో రూపొందించే విజువల్స్ కాబట్టి అవి ఇంపాక్ట్ చేయలేవు. అది చెప్పే కథ ప్రేక్షకుల హృదయాన్ని తాకదు. అలా ఈ టెక్నాలజీతో లొకేషన్స్, భారీ కాస్టింగ్ లేకుండా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించవచ్చు. కానీ దాని ప్రభావం మాత్రం అంతగా ఉండదని విశ్లేషకుల అభిప్రాయం.