తెరపైకి మరో మారఠా సంచలనం!
మరాఠా యోదురాలు, మహారాణి అహల్యా బాయి హోల్కర్ జీవితాన్ని వెండి తెరకు ఎక్కించడానికి రంగం సిద్దమవుతోంది.
By: Tupaki Desk | 8 May 2025 1:00 PM IST'ఛావా'తో మరాఠా సంచలనం శంభాజీ ధైర్యసాహసాలు నేటి ప్రపంచానికి తెలిసిన సంగతి తెలిసిందే. శాంభాజీ మహారాజ్ ఎంతటి పరాక్రమవంతుడన్నది? అర్దమైంది. ఇనుప చవ్వలతో కళ్లు పొడిచినా? గుండెతెగి కింద పడినా? తాను నమ్మిన సిద్దాంతానికి మరాఠాలు ఎంతగా కట్టుబడి ఉంటారన్నది నేటి సమాజానాకి అవగతమైంది. హిందు మతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ హిందువుపై ఉందని బలమైన సందేశాన్ని ఛావా ద్వారా యావత్ భారతానికి లక్ష్మణ్ ఉట్టేకర్ పంపించాడు.
సినిమా వాణిజ్య పరంగాను పెద్ద సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో మరాఠా సంచలనం తెరపైకి రాబోతుంది. ఈసారి ఆబాధ్యలు ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా తీసుకుంది. మరాఠా యోదురాలు, మహారాణి అహల్యా బాయి హోల్కర్ జీవితాన్ని వెండి తెరకు ఎక్కించడానికి రంగం సిద్దమవుతోంది. దీనికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన కూడా రిలీజ్ చేసింది.
రాణి అహల్యాబాయి జీవితం ఎంతో మందికి స్పూర్తి దాయకం. అందుకే ఆమె జీవితాన్ని సినిమాగా ప్రేక్ష కుల ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ తెలిపారు. మారాఠీతో పాటు ఇతర భాషల్లో కూడా చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. దూరదర్శన్ తో పాటు ఇంతర అన్ని రకాల ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. సినిమాకి సంబంధించి ఇప్పటికే చర్చలు జరుగు తున్నాయన్నారు.
మరాఠాలు పరిపాలించిన మాల్వా సామ్రాజ్యాన్ని పరిపాలించి మహారాణి అహల్యాబాయి. హిందు మతన్నా కాపాడేందుకు ఆలయాలను పునర్నిర్మించారు. ఆమె పాలన కాలంలో కాలువలు, చెరువులు తవ్వించి వ్యవ సాయ అభివృద్ధికి కృషి చేసారు. అహల్యాబాయి పేరిట భారత ప్రభుత్వం స్త్రీ శక్తి పురస్కారాన్ని కూడా అందిస్తుంది.
