Begin typing your search above and press return to search.

శంక‌ర్ రిక‌మండ్ చేయ‌కుండానే అతిథికి అవ‌కాశాలు

తాజాగా ఆమె నాలుగో సినిమాకి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.

By:  Tupaki Desk   |   2 March 2024 7:42 AM GMT
శంక‌ర్ రిక‌మండ్ చేయ‌కుండానే అతిథికి అవ‌కాశాలు
X

దర్శకుడు శంకర్ కుమార్తె అదితి ప్రతిభ గల నటి కం నేపథ్య గాయనిగా సుప‌రిచితం. త‌ను నటించిన మొదటి రెండు చిత్రాలైన విరుమాన్ - మావీరన్ లలో అద్భుత‌ నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు కురిసాయి. విష్ణువర్ధన్ దర్శకత్వంలో అదితి మూడో సినిమా షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఆమె నాలుగో సినిమాకి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.

జయం రవి `బ్రదర్` తర్వాత తన తదుపరి చిత్రంలో అథర్వ -అదితి శంకర్ జంట‌ను దర్శకత్వం వహిస్తున్నట్లు దర్శకుడు రాజేష్ ఎం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ధృవీకరించారు. ఈ ప్రాజెక్ట్ బలమైన ఎమోషన్స్‌తో కూడిన లైట్ కామెడీ ఎంటర్‌టైనర్‌. ఈ వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

అధర్వ, అదితి జంటగా నటిస్తున్న కొత్త చిత్రాన్ని శ్రీ వారి పిక్చర్స్ నిర్మించనుంది. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ వెంచర్‌కి సంగీతం సమకూర్చేందుకు సామ్ సిఎస్ ఎంపిక‌య్యారు. దర్శకుడు రాజేష్ ప్రకటన మేరకు 2024 సమ్మర్‌లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. విష్ణువర్ధన్ దర్శకత్వంలో అదితి శంకర్ నటిస్తున్న మూడో చిత్రంలో అధర్వ సోదరుడు ఆకాష్ మురళి హీరోగా నటించనున్నార‌ని స‌మాచారం.

మ‌రోవైపు విరుమాన్(2022 యాక్ష‌న్ డ్రామా) లో కార్తీ స‌ర‌స‌న న‌టించిన అతిథి శంక‌ర్ త‌దుప‌రి కార్తీ సోద‌రుడు, స్టార్ హీరో సూర్య స‌ర‌స‌న న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. ఏది ఏమైనా ప్ర‌తిభ‌కు అవ‌కాశాల‌కు కొద‌వేమీ ఉండ‌వ‌ని, దానికి స్టార్ డైరెక్ట‌ర్ అయిన శంక‌ర్ రిక‌మండేషన్ అవ‌స‌రం లేద‌ని నిరూప‌ణ అవుతోంది.