Begin typing your search above and press return to search.

చీర కట్టులో రాధిక.. చూపులతోనే చంపేస్తుంది

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా వైరల్‌ అవుతూనే ఉంది. ఈ అమ్మడి అందాల ఆరబోతకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు

By:  Tupaki Desk   |   6 Sep 2023 4:10 AM GMT
చీర కట్టులో రాధిక.. చూపులతోనే చంపేస్తుంది
X

డీజే టిల్లు సినిమా తో పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ నేహా శెట్టి. ఆ సినిమా లో రాధిక పాత్ర ను తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు అనడంలో సందేహం లేదు. డీజే టిల్లు తర్వాత వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినా కూడా మంచి పాత్రలు ఎంపిక చేసుకుని ఈ అమ్మడు సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఇక ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా వైరల్‌ అవుతూనే ఉంది. ఈ అమ్మడి అందాల ఆరబోతకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా మరోసారి ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చీర కట్టు లో సాధారణంగానే ఆడవారు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. అలాంటిది ఈ ఫోటోలో నేహా శెట్టి అంతకు మించి అన్నట్లుగా కనిపిస్తుంది.

చీర కట్టులో నడుము అందం చూపించకుండా, క్లీ వేజ్ షో చేయకుండా అందరి దృష్టిని నేహా శెట్టి ఆకర్షిస్తోంది. ఆ చూపులతోనే మత్తు ఎక్కిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూపులతో చంపేస్తున్న ఈ అమ్మడి ఫోటోలు స్కిన్‌ షో ఫోటోలను మించి వైరల్ అవ్వడం విశేషం.

తాజాగా ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలతో పాటు వరుస సినిమాలతో సందడి చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు కార్తికేయతో హీరోయిన్‌ గా నటించిన సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ అమ్మడు ఇతర భాష లో కూడా ఒక సినిమా చేయబోతుందనే వార్తలు వస్తున్నాయి.