Begin typing your search above and press return to search.

"రోజా" మీద ఒట్టు... ఈమె వయసు 54 ఏళ్లు!

కొంతమంది మగాళ్లకు వయసుతో సంబంధం ఉండదు... ఎంత వయసు వచ్చినా చాలా ఫిట్ గా, యాక్టివ్ గా కనిపిస్తారు

By:  Tupaki Desk   |   25 Oct 2023 4:30 PM GMT
రోజా మీద ఒట్టు... ఈమె వయసు 54 ఏళ్లు!
X

కొంతమంది మగాళ్లకు వయసుతో సంబంధం ఉండదు... ఎంత వయసు వచ్చినా చాలా ఫిట్ గా, యాక్టివ్ గా కనిపిస్తారు. ఇక మహిళల విషయానికొస్తే... కొంతమందిని చూస్తే వీళ్ల వయసు రివర్స్ లో వెళ్తుందేమో అనిపిస్తుంటుంది. వయసు పెరిగే కొద్దీ వీరి అందం పెరుగుతుంటుంది. వారికి వారుగా చెబితే తప్ప వారి వయసు తెలుసుకోవడం పెద్ద టాస్కే! అలాంటి అతితక్కువమంది హీరోయిన్స్ లో ఒకరు మధుబాల!

అవును... హాఫ్ సెంచరీ దాటినా కూడా ఎక్కడా ఆ తాలూకు లక్షణాలు కనిపించకుండా.. ఫిట్ గా ఉంటూ, అందానికి అసూయ కలిగించేలా కనిపిస్తున్నారు మధుబాల. తాజాగా ఒక ఈవెంట్ కు హాజరైన ఆమెను చూసిన కెమెరాలకు సైతం కన్ను కుట్టుందని చెప్పినా అతిశయోక్తి కాదేమో! ఆ లెవెల్ లో కనిపించారు మధుబాల.! సపోజ్ ఎవరైనా మధుబాలను చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే... కచ్చితంగా ఆకర్షణలో పడతారనడంలో సందేహం ఉండకపోవచ్చు!!

కాగా... మధుబాల 90వ దశకంలో పాపులర్ నటి అనే విషయం తెలిసిందే. 1991లో కె బాలచందర్ దర్శకత్వం వహించిన "అళగన్‌" సినిమాతో సినిమాఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మధుబాల.. ఆ తర్వాత మణిరత్నం తీసిన "రోజా" సినిమాలో తన అద్భుతమైన నటన, చూపు తిప్పుకోనివ్వని సొగసుతో మెస్మరైజ్ చేసింది. ఆ సినిమాలో పాటలు ఇప్పటికీ టీవీలో వస్తుంటే... ఆమె కోసం రిమోట్ పక్కన పెట్టేవారు ఎంతో మది!!

ఇలా... తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఆమె ఎన్నో సినిమాలు చేశారు. తెలుగులో అల్లరి ప్రియుడు, ఆవేశం, చిలక్కొట్టుడు, గణష్, జెంటిల్ మెన్ చిత్రాల్లోనూ తనదైన అందం, నటనతో మధు అధరగొట్టారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగులో "నిఖిల్ – సూర్య వర్సెస్ సూర్య", "ఎన్టీఆర్ - నాన్నకు ప్రేమతో", "ప్రేమదేశం" సినిమాలో నటించారు మధుబాల!

ఇక తమిళనాడుకు చెందిన మధుబాలకు అప్పట్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ముఖ్యంగా రోజా సినిమాలో కాశ్మీర్ అందాల మధ్యలో.. "పరువం వానగా నేడు కురిసేనులే..." అనే పాటలో ఆమెను చూసిన కుర్రకారు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారన్నా అతిశయోక్తి కాదు! ఆ రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్న మధుబాల.... ప్రముఖ నటిమణులు హేమా మాలిని, జుహీ చావ్లాలకు బంధువైన ఆనంద్ షాను 1999 ఫిబ్రవరి 19న వివాహం చేసుకున్నారు.

వీరికి అమెయా, కెయా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివాహానంతరం కెరీర్‌ లో స్వల్ప విరామం తీసుకున్న మధుబాల.. సెకండ్ ఇన్సింగ్స్‌ లో భాగంగా తల్లి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి! ఈ ఫోటోలు చూస్తున్న సీనియర్స్.. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తున్నారు!