Begin typing your search above and press return to search.

'RX 100', 'బేబీ' బ్యూటీలే​ కాదు... మేమూ ఉన్నాం బాబు

అమ్మాయిలు ఇలానే ఉంటారంటూ తప్పుబడుతున్నారు

By:  Tupaki Desk   |   22 July 2023 5:44 AM GMT
RX 100, బేబీ బ్యూటీలే​ కాదు... మేమూ ఉన్నాం బాబు
X

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'బేబీ'. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్​ను షేక్ చేస్తోంది. ఇప్పుడీ చిత్రం దాదాపు రూ.50కోట్ల గ్రాస్​ కలెక్షన్స్​కు చేరువలో ఉంది అంటే.. ఈ సినిమా ఏ రేంజ్‌లో ఆడియెన్స్​ను ఆకట్టుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. ట్రయాంగిల్ లవ్​ స్టోరీ నేపథ్యంలో వచ్చినా ఈ సినిమాను.. మరీ ముఖ్యంగా యూత్ ఆడియెన్స్​ బ్రహ్మరథం పడుతున్నారు.

ఎందుకంటే.. యువ‌త‌కు బాగా క‌నెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంది. సినిమాలో క‌నిపించే చాలా స‌న్నివేశాలు ఈ జనరేషన్​ యువ‌తీ యువ‌కుల మ‌ధ్య ఉన్న ప్రేమ‌కు.. వారి ఆలోచ‌నా విధానాల‌కు అద్దం ప‌ట్టేలా తీశారు. దీంతో కాలేజీ కుర్రాళ్ల పుణ్యామా అని సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. అయితే ఈ సినిమా పెర్ఫామెన్స్​ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. అందుగా ముందుగా మాట్లాడుకుంటోంది హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించే.

ఎందుకంటే ఈ చిత్రంలో వైష్ణవి చేసిన పాత్ర, ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి. థియేటర్స్​లో విజిల్స్ పడ్డాయి. అయితే ఇదే సమయంలో సినిమాలో వైష్ణవి చైతన్య పాత్ర చేసిన తప్పుకు.. నెటిజన్లు(అబ్బాయిలు) రియల్​ లైఫ్​లో అమ్మాయిలను ఉద్దేశిస్తూ తప్పుగా ఊహించుకుంటున్నారు.

అమ్మాయిలు ఇలానే ఉంటారంటూ తప్పుబడుతున్నారు. గతంలో 'ఆర్​ఎక్స్ 100'లో పాయల్ రాజ్​పుత్​ పాత్ర కూడా ఇలానే ఉంటుంది. హీరోను మోసం చేసేదిలా. దీంతో అందరూ ​'RX 100', 'బేబీ' చిత్రాల హీరోయిన్ల సీన్లను సోషల్​మీడియా షేర్​ చేస్తూ అమ్మాయిలను తిడుతున్నారు.

అయితే ఇది ఎంత వరకు కరెక్ట్​ అనేది చూస్తే.. సిల్వర్​ స్క్రీన్​పై ఎన్నో బెస్ట్ లవ్​ స్టోరీస్​ కూడా ఉంటాయి. అందులో హీరో కోసం హీరోయిన్లు పడే ఆరాటం, వారి ఆలోచనలు, మాటలు, ఉండే విధానం కూడా ఆడియెన్స్​ను ఆకట్టుకున్నాయి. అయితే ప్రస్తుతం 'ఆర్స్​ఎక్స్​ 100', 'బేబీ' హీరోయిన్లకు సంబంధించిన వీడియోలు ట్రెండ్​ అవుతుంటే.. ఇప్పుడు దానికి దీటుగా తెలుగు చిత్రసీమలోని లవ్​ స్టోరీస్​లో బెస్ట్​ హీరోయిన్స్​ రోల్స్​ను ఒకచోటకు చేర్చి వీడియోగా క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు.

ఈ వీడియోలో గోదావరి(రూపా), మణిరత్నం సఖి(శాంతి), నువ్వొస్తానంటే నేనొద్దంటానా(సిరి), అంటే సుందరానికి(లీలా), సీతారామం(సీత).. ఇంకా పలు సినిమాల్లోని హీరోయిన్​ పాత్రలను ఇందులో చూపించారు. 'అబ్బాయిలు భయపడకండి. మంచి అమ్మాయిలు' కూడా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదిఏమైనా సినిమాలోని పాత్రలను సీరియస్​గా తీసుకోవడం సరికాదని, బయట రియల్​ లైఫ్​ ప్రపంచంలోని ఉండాలని అంటున్నారు. బయట మంచి చెడు రెండు ఉన్నాయని చెబుతున్నారు.