సూపర్ స్టార్ భవితవ్యం తేలి పోయేనా..?
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ త్వరలో 'సితారే జమీన్ పర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
By: Tupaki Desk | 16 May 2025 3:00 AM ISTబాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ త్వరలో 'సితారే జమీన్ పర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా ఏళ్ల క్రితం వచ్చిన 'తారే జమీన్ పర్' సినిమాకు ఇది సీక్వెల్ అనే ప్రచారం జరిగింది. వాస్తవానికి సితారే జమీన్ పర్ సినిమాకు అప్పట్లో వచ్చిన తారే జమీన్ పర్ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని సమాచారం. ఇటీవల వచ్చిన టీజర్, ట్రైలర్‌తో సినిమా కథ ఏంటో పూర్తిగా క్లారిటీ వచ్చింది. ఈ సినిమా స్పానిష్ మూవీ కాంపియోన్స్ కి అఫిషియల్ రీమేక్ అనేది ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇంగ్లీష్‌లో ఇదే సినిమా ఛాంపియన్స్ టైటిల్‌తో రీమేక్ అయింది. ఇప్పుడు తెలుగులో సితారే జమీన్ పర్ అనే టైటిల్‌తో రాబోతుంది.
ఆమీర్ ఖాన్ సూపర్ హిట్ దక్కించుకుని చాలా సంవత్సరాలు అవుతోంది. ఆయన ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అత్యధిక సక్సెస్ రేటు కలిగి ఉన్న హీరోగా నిలిచాడు. కానీ ఇప్పుడు బాలీవుడ్ ఫ్లాప్ హీరోలతో పోటీ పడుతూ మరీ ఆమీర్ ఖాన్ తన ఆదిపత్యంను కోల్పోయాడు. దారుణమైన ఫామ్‌లో ఉన్న ఆమీర్ ఖాన్ ఇప్పుడు సితారే జమీన్ పర్ సినిమాతో హిట్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమాలో ఆయన పాత్ర గురించి ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చింది. హీరోయిజం చూపించే అవకాశం లేదు, రొమాంటిక్ సీన్స్‌లో కనిపించే అవకాశం లేదు, రెగ్యులర్ ఫక్త్ సినిమా కానే కాదు. అయినా కూడా ఈ సినిమా హిట్ అయితే ఆయన కెరీర్ ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి.
సూపర్ స్టార్ ఆమీర్ వయసు పెరుగుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి దూరం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. హీరోగా గత దశాబ్ద కాలంగా సక్సెస్ లేకపోవడంతో ఇక ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి ఆమీర్ ఖాన్ ఇతర పనులతో బిజీ అయ్యే అవకాశం కూడా ఉందని కొందరు అంటున్నారు. అదంతా కూడా సితారే జమీన్ పర్ సినిమా ఫలితాన్ని బట్టి ఉంటుంది అనేది పలువురి అభిప్రాయం. సోషల్ మీడియాలో ఇప్పటికే ఆమీర్ ఖాన్ గురించి ఓ రేంజ్‌లో ట్రోల్స్ వస్తున్నాయి. ఖాన్స్ త్రయం అంటూ ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏళిన ఆమీర్, షారుఖ్, సల్మాన్‌లు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ వారి పరిస్థితి ఆశాజనకంగా లేదు.
సితారే జమీన్ పర్ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అయింది. వచ్చే ఏడాదిలో సినిమా విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. అనూహ్యంగా సినిమా ను ఈ జూన్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ చేశారు. సినిమాను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు కామెంట్ చేస్తూ ఉన్నారు. సినిమా ఎప్పుడు విడుదల అయినా హిట్ టాక్ దక్కించుకుని భారీ వసూళ్లు సొంతం చేసుకుంటేనే ఆమీర్ ఖాన్‌కి తన సూపర్ స్టార్ హోదా కంటిన్యూ అయ్యేను, అలాగే ఆయన ఇండస్ట్రీలో మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు ఉంటాయి అంటూ సినీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.
