Begin typing your search above and press return to search.

2025 సెకండాఫ్.. 6 నెలలు.. 10 పాన్ ఇండియా చిత్రాలు!

ఒక్క నవంబర్ తప్ప నెలకు కనీసం ఒక్క పాన్ ఇండియా మూవీ అయినా సందడి చేయనుంది. ఆ సినిమాలేంటి? ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి? వంటి వివరాలు మీకోసం.

By:  Tupaki Desk   |   17 July 2025 1:00 PM IST
2025 సెకండాఫ్.. 6 నెలలు.. 10 పాన్ ఇండియా చిత్రాలు!
X

2025 ఫస్టాఫ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. బాక్సాఫీస్ వద్ద వివిధ సినిమాలు రిలీజ్ అవ్వగా.. కొన్ని హిట్స్ గా నిలిచాయి. మరికొన్ని ఫ్లాప్స్ గా మారాయి. ఇప్పుడు సెకండాఫ్ మొదలైంది. అనేక సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఒక్క నవంబర్ తప్ప నెలకు కనీసం ఒక్క పాన్ ఇండియా మూవీ అయినా సందడి చేయనుంది. ఆ సినిమాలేంటి? ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి? వంటి వివరాలు మీకోసం.

ముందుగా ప్రస్తుత జులై నెల విషయానికొస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కానుంది. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఆ సినిమా జులై 24న విడుదల అవ్వనుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నాటి కథతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా మూవీ సందడి చేయనుంది.

ఆ తర్వాత ఆగస్టులో రెండు పాన్ ఇండియా చిత్రాలు బిగ్ క్లాష్ కు సిద్ధమవుతున్నాయి. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ మూవీ, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వార్-2 సినిమాలు.. ఆగస్టు 14న రిలీజ్ కానున్నాయి. రెండింటినీ యాక్షన్ డ్రామాలుగా లోకేష్ కనగరాజ్, అయాన్ ముఖర్జీ రూపొందించారు.

ఇక సెప్టెంబర్ లో వివిధ పాన్ ఇండియా సినిమాలు విడుదలవుతున్నాయి. యంగ్ హీరో తేజ సజ్జా అప్ కమింగ్ మూవీ మిరాయ్ సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. ఆ తర్వాత నటసింహం బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాలు అఖండ 2, ఓజీ సెప్టెంబర్ 25న విడుదలవుతున్నాయి. బోయపాటి శ్రీను, సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఆయా చిత్రాలపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

అక్టోబర్‌ లో స్టార్ హీరో రిషబ్ శెట్టి తన సూపర్ హిట్ చిత్రం కాంతారా ప్రీక్వెల్‌ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాంతారా: చాప్టర్ 1 తో అక్టోబర్ 2న సందడి చేయనున్నారు. నవంబర్ లో ఎలాంటి పాన్ ఇండియా రిలీజ్ లేనప్పటికీ.. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో పాన్ ఇండియా ప్రభాస్ రాజా సాబ్ తో థియేటర్స్ లోకి రానున్నారు.

మారుతి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. అదే రోజు రణవీర్ సింగ్ దురంధర, షాహిద్ కపూర్ సినిమాలు కూడా రానున్నాయి. క్రిస్మస్ స్పెషల్ గా యంగ్ హీరో అడివి శేష్ డెకాయిట్ తో పాటు అవతార్-3 విడుదల కానుంది. వీటితోపాటు మరికొన్ని సినిమాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఏ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.