Begin typing your search above and press return to search.

కళ్లు పీకి.. దారుణంగా ఆత్యాచారం చేసి.. హత్య!

చిత్తూరు జిల్లా వేణుగోపాలపురం గ్రామానికి చెందిన భవ్య ఇంటర్ చదువుతోంది. ఈ నెల 17 సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.

By:  Tupaki Desk   |   26 Sep 2023 4:07 AM GMT
కళ్లు పీకి.. దారుణంగా ఆత్యాచారం చేసి.. హత్య!
X

ఘోర హత్యాచారం చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి తెలిసినంతనే అయ్యో అనిపించేంత దారుణం కలిచివేస్తోంది. స్థానికంగా షాకింగ్ గా మారిన ఈ ఉదంతంపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసుల మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాము ఫిర్యాదు చేసినంతనే స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదంటున్నారు. ప్రేమ పేరుతో ముగ్గురు కుర్రాళ్లు వెధిస్తున్నారని.. మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఉంటారని.. దారుణంగా హత్య చేశారని కన్నీరుమున్నీరు అవుతున్నారు.

చిత్తూరు జిల్లా వేణుగోపాలపురం గ్రామానికి చెందిన భవ్య ఇంటర్ చదువుతోంది. ఈ నెల 17 సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. మూడు రోజుల తర్వాత గ్రామం సమీపంలోని బావిలో ఆమె డెడ్ బాడీ లభించింది. బాధితురాలి తల్లిదండ్రుల ఆరోపణల్ని చూస్తే.. ఆమెను ప్రేమ పేరుతో మండలానికి చెందిన ముగ్గురు యువకులు వేధింపులకు గురి చేసేవారు. వారే.. మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లి ఉంటారని పేర్కొంటున్నారు.

వినాయక నిమజ్జనం కోసం 20న కొందరు బావి వద్దకు వెళ్లగా.. మ్రతదేహం కనిపించింది. ఆ తర్వాత బయటకు తీయగా.. ఒంటి మీద ఆభరణాల్ని చూసి భవ్యశ్రీ డెడ్ బాడీగా గుర్తించారు. తమ కుమార్తె కనిపించటం లేదని ఈ నెల 18నే పోలీసులకు ఫిర్యాదు చేశామని.. వారు సకాలంలో స్పందించి ఉంటే ఆమె బతికేదని బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మ్రతదేహాన్ని చూస్తే.. జుట్టు కత్తిరించి.. కళ్లు పీకేసి.. దారుణ రీతిలో ఆమెను హింసించినట్లుగా భావిస్తున్నారు. అనుమానితుల్ని పిలిపించి.. అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.

కాల్ డేటాను పరిశీలించగా అనుమానాస్పద రీతిలో ఏమీ కనిపించటం లేదని తెలుస్తోంది. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారటంతో.. పోలీసులు ఈ కేసు మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం ఈ ఉదంతాన్ని మానిటర్ చేస్తున్నారు. భవ్యశ్రీ మరణం వెనుక ఉన్న వారెవరు? ఎందుకింత దారుణానికి పాల్పడ్డారన్నది తేలాల్సి ఉంది.